kaduputho-unappudu-srungaram-gurinchi-ee-moodha-nammakalanu-veedandi-nivruthi

కడుపుతో ఉన్నపుడు సెక్స్ గురించి చాలా రకాల మూఢనమ్మకాలు అపోహలు మనము వింటుంటాము. ఒకరు సెక్స్ చేస్తే పిల్లలకు ప్రమాదం అని అంటారు, ఒకరు అస్సలు చేయకూడదు తప్పు అంటారు, మరొకరేమో ఏమి కాదు, సెక్స్ చేయచ్చు అని అంటారు.  వీటిలో ఎవరి మాట నమ్మాలి అనే సందేహంలో ఉన్నారా. ఐతే మీకోసమే ఈ ఆర్టికల్. కడుపుతో ఉన్నప్పుడు మొదటి త్రైమాసికం మరియు కాన్పుకి నాలుగు వారల ముందు నుంచి తప్పా మిగిలిన అన్ని రోజులు నిర్మొహమాటంగా  సెక్స్ లో పాల్గొనచ్చు. ఇప్పుడు సాధారణంగా సెక్స్ గురించి ఉండే మూఢ నమ్మకాలు ఏమిటో తెలుసుకుందాము.

1. లోతుగా సెక్స్ చేస్తే బిడ్డకు హానికరం

అన్నిటికంటే ఇదే పెద్ద మూఢనమ్మకం. చాలా మంది కడుపుతో ఉన్నప్పుడు సెక్స్ చేస్తే కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం అనుకుంటారు. కానీ, నిజానికి సెక్స్ చేయడం వలన కడుపులో ఉన్న బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేదు. బిడ్డ చాలా పొరల లోపల ఉంటాడు, అస్సలు సెక్స్ కి బిడ్డకి సంబంధం లేదు. కావున హాయిగా ఎటువంటి ఆలోచనలు లేకుండా సెక్స్ని ఎంజాయ్ చేయండి.

2. భావప్రాప్తి చందడం వలన గర్భస్రావం జరుగుతుంది

సెక్స్ తరువాత భావప్రాప్తి చెందడం అనేది అత్యంత సాధారణ విషయం. కానీ కొంత మంది ఇలా జరిగితే గర్భస్రావం అయ్యా అవకాశం ఉంది కాబట్టి సెక్స్ చేయకూడదు అని చెప్తుంటారు. కానీ అది నిజం కాదు, అస్సలు నమ్మకండి.

3. నొప్పిగా ఉంటుంది

సరైన పొజిషన్లో చేస్తే కడుపుతో ఉన్నపుడు కూడా సెక్సని పూర్తిగా అనుభవించగలరు. కడుపుతో ఉన్నప్పుడు నెమ్మదిగా, సున్నితంగా, సరైన పొజిషన్లో సెక్స్ చేయాలి. తొందరగా భావప్రాప్తి కలగాలని వేగంగా చేయడం మంచిది కాదు. కడుపు మీద మరియు బ్రెస్ట్ మీద ఒత్తిడి పడకుండా చూసుకోండి.

4. కాన్పు తొందరగా వచ్చేసే ప్రమాదం ఉంది

ఇది కొంత వరకు నిజమే కానీ భయపడాల్సిన విషయం ఏమి కాదు. కండోమ్స్ వంటి రక్షణ పాటిస్తే ఇలా జరగదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, కడుపుతో ఉన్న సమయంలో సెక్స్ చేస్తుంటే కచ్చితంగా కండోమ్స్ వాడండి.

5. ఓరల్ సెక్స్ ప్రమాదం

ఇది కూడా కొంత వరకు నిజమే. ఓరల్ సెక్స్ చేస్తున్నప్పుడు యోనిలోకి గాలి వెళ్లి గాలి బుడగ తయారు అయ్యే అవకాశం ఉంది. అందువలన వీలైనంత వరకు దానిని చేయకపోవడం మంచిది.

Leave a Reply

%d bloggers like this: