mee-pillalu-jalubu-daggutho-baadhapaduthunnara-intlone-suluvuga-ee-chitkalatho-tagginchukondi

జలుబు మరియు దగ్గు ఈరోజుల్లో చాలా సులువుగా వచ్చేస్తుంటుంది. వాన కాలం, చలి కాలం అయితే ఇంక చెప్పనవసరం లేదు. ముఖ్యంగా పిల్లలు జలుబు, దగ్గుకి అత్యంత వేగంగా, తరచుగా గురవుతుంటారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ వారు ఇచ్చిన సమాచారం ప్రకారము పిల్లలు సగటున 6 నుంచి 10 సార్లు జలుబు బారిన  పడుతారంట. కావున ప్రతి సారి హాస్పిటల్ కి వెల్ల వలసిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే జలుబు మరియు దగ్గుని సులువుగా తగ్గించుకోవచ్చు.  ఎలాగంటే…

1. తేనె

ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో తెలిసిన దాని ప్రకారము పిల్లలకు కాఫ్ సిరప్ కంటే తేనె జలుబు నుండి వేగంగా ఉపశమనం కల్గిస్తుందంట. కానీ, ఒక్క విషయం మర్చిపోకండి, సంవత్సరం దాటినా పిల్లలకు మాత్రమే తేనెను ఇవ్వాలి. తేనెలో ఉండే మరో ప్రయోజనం ఏమిటంటే పిల్లలు ఇష్టంగా తింటారు. కాఫ్ సిరప్ తాగడానికి చేసినంత మారం చేయరు.

2. సూప్

జలుబుతో ఉన్నప్పుడు వెచ్చగా ఉండే ఏ పదార్థము తాగిన హాయిగా కొంచెం ఉపశమనంగా ఉంటుంది. అంతే కాకుండా, పరిశోధనల ప్రకారము చికెన్ సూప్ లో ఉండే యాంటీ ఇంఫలమేటరీ గుణాలు జలుబుని తగ్గిస్తాయంట. జలుబుతో బాధ పడుతునప్పుడు సాలిడ్ ఫుడ్స్ తినడం అంత రుచించదు కనుక సూప్ తాగడం సౌకర్యంగా ఉంటుంది.

3. తలని కొంచెం ఎత్తి పాడుకోబెట్టండి

పడుకునే సమయంలో దిండు సహాయంతో తలని కొంచెం పైకి ఎత్తి పాడుకోబెట్టండి. ఇలా చేయడం ద్వారా శ్వాస సులభంగా అంది పిల్లలు హాయిగా నిద్రపోతారు.

4. ఆవిరి పట్టండి

ఆవిరి పట్టించడం ద్వారా మూసుకున్న ముక్కులు తెరుచుకుని శ్వాస తీసుకోవడం సులువు అవుతుంది. పిల్లలకు ఆవిరి పట్టించడం కొంచెం కష్టమే కానీ తొందరగా జలుబు నయం అవ్వాలి అంటే దీనికన్నా మంచి మార్గం లేదు.

5. సెలైన్ డ్రాప్స్

పిల్లలు ముఖ్యంగా జలుబు చేసినప్పుడు ముక్కులు మూసుకొని పోతాయి.  ఇలాంటి సమయంలో సెలైన్ డ్రాప్స్ బాగా ఉపయోగ పడతాయి. వీటిని ముక్కులో వేయడం ద్వారా ముక్కుదిబ్బడ నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. 

Leave a Reply

%d bloggers like this: