pasipillala-thala-meedha-chamata-pattadaniki-mukhyamaina-4-karanalu

మీ పిల్లలు నిద్రపోయేటప్పుడు లేదా తినేటప్పుడు తల మీద చమట పట్టడం ఎప్పుడైనా గమనించారా? అలా ఎందుకు జరుగుతుంది అని భయపడుతున్నారా? పిల్లలలో అలా జరగడం సహజమే. పిల్లల శరీరంలో వేడి బయటకు పంపడానికే, చమట పడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉంటుంది,  దానికి ముఖ్యమైన కారణాలు ఇవే….

మొదటి కారణం:

పసి పిల్లలకు తల భాగం లోనే చమట పట్టడానికి కారణం, శరీరంలో చమట గ్రంథులు (sweat glands) మొదట తల భాగంలో పూర్తిగా ఏర్పడుతాయి. తర్వాత పిల్లలు ఎదిగె కొద్దీ, శరీరం మొత్తం ఏర్పడుతాయి. అందుకే పిల్లలకు తల భాగంలో ఎక్కువగా చమట పడుతుంది. పిల్లలకు చమట పడుతుంది అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు అర్ధం.

రెండవ కారణం:

మన గుండె నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుంది. కానీ పసి పిల్లల గుండె నిమిషానికి 130 సార్లు కొట్టుకుంటుంది. అందుకే వాళ్ళు ఊపిరి తీసుకునే రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు చమట పోయడానికి ఇది కూడా ఒక కారణం. పిల్లలకు చమట మరి ఎక్కువైతే తడిబట్టతో తల భాగం తుడవండి. అయితే తడి ఎక్కువ సేపు ఉంచకండి. తడి బట్టతో తుడిచినా తరువాత కాసేపు ఆగి పొడి బట్టతో కూడా తుడవండి.

మూడవ కారణం:

పగటిపూట కానీ, రాత్రిపూట కానీ ఎప్పుడైనా పిల్లలు నిద్రపోయేటప్పుడు, వాళ్ళను పూర్తిగా దుప్పటిలో కప్పేయకండి. అలా చేయడం పిల్లలకు చమట పోయడానికి ఒక కారణం. అలా చేసినప్పుడు పిల్లల శరీరంలో వేడి పెరిగి పోతుంది, చమట పోస్తుంది. అలాగే మంచి వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోండి, పిల్లలకు చాలా అవసరం.

నాలుగవ కారణం:

పిల్లల జుట్టు మరి ఎక్కువగా పెరిగిపోతే చమట ఎక్కువ పడుతుంది. వంటిలో వేడి పెరిగిపోవడం జుట్టు ఎక్కువగ ఉన్నప్పుడు జరుగుతుంది.  అందుకే పిల్లలకు జుట్టు పెరిగినప్పుడు తప్పకుండా కత్తిరించాలి. పిల్లల జుట్టు ఎప్పుడైనా షార్ట్ గా ఉంటె మంచిది. 

Leave a Reply

%d bloggers like this: