5-adbuthamina-chitkalu-pillalu-puttina-taruvath-kud

అమ్మతనం అనేది ఒక గొప్ప వరం. పిల్లలు పుట్టిన తరువాత మనం పొందే అనుభూతి వర్ణనాతీతం. కానీ ఈ క్రమంలో మన అందం మీద శరీరం మీద శ్రద్ద తగ్గించడం  వలన పూర్వ సౌదర్యం కోల్పోతాము. కొత్తగా తల్లి అయిన తరువాత మనం చాలా బిజీగా, పిల్లల సంరక్షణలో లీనమైపోతాము.  మన మీద శ్రద్ద తీసుకోవడానికి అస్సలు టైం అనేదే లేకుండా పోతుంది. అందువలనే చాలా మంది వారి అందం తగ్గిందని వాపోతుంటారు. కానీ పిల్లలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినా మన శరీరం బాగు చేసుకోవడానికి రోజులో కొంత భాగం కేటాయించడం అవసరం. ప్రెగ్నన్సీ సమయంలో మన జుట్టు, శరీరాకృతి, బరువు ఇలా అన్నిటిలో ఎంతో మార్పు వస్తుంది. కావున కొంచెం మన ఆరోగ్యం మరియు శరీరం మీద కూడా శ్రద్ద వహించాలి. మీకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి సులువుగా, తొందరగా మీ మునుపటి అందాన్ని తిరిగి పొందడానికి ఈ 5 అద్భుతమైన చిట్కాలను పాటించండి.

1. కంటి కింద నల్లటి వలయాలు

మీరు హాయిగా ప్రపంచంతో సంబంధం లేకుండా నిద్రపోయే రోజులు ఇప్పుడు లేవు. నిద్రలేని కారణంగా కంటి చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు  మీ అందం తగ్గిస్తుండచ్చు. నిద్రలేకపోవడంతో పాటు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం, విటమిన్ K మరియు విటమిన్ C లోపం కూడా ఇందుకు కారణాలు అయ్యుండచ్చు. దీనిని తగ్గించాలంటే రోజుకి కనీసం 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. కంటి మీద కాసేపు కీరా కాయ ముక్కలను పెట్టుకోండి. కుదిరితే బంగాళా దుంప రసం కాటన్ సహాయంతో కంటి చుట్టూ మర్దనా చేసుకోండి.

2. మొటిమలు

మొటిమలు హఠాత్తుగా ఎందుకు వచ్చాయి? వాటి కారణాలు ఏమిటి అని ఆలోచిస్తున్నారా? భయపడకండి. వాటిని కూడా సులువుగా నివారించుకోవచ్చు. శరీరంలో హార్మోన్ల సమతుల్యత కోల్పోవడం వలన మొటిమలు వస్తాయి. వీటిని నివారించాలి అని అంటే అలో వీర జెల్ ని పడుకునే ముందు రాసుకొని నిద్రపోండి. అంతే కాకుండా నూనె మరియు కొవ్వు పదార్థాలు దూరంగా ఉండండి.

3. నల్లటి మచ్చలు

కొంత మందికి పిల్లలు పుట్టిన తరువాత ముఖం మీద నల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉంది. ఒంట్లో అధికంగా ఉత్పన్నం అవుతున్న ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరోన్ హార్మోన్లు దీనికి కారణం. ఈ హార్మోన్లు నిదానంగా సహజ స్థాయికి వచ్చేస్తాయి. కానీ అంత లోపు ఎక్కువ మచ్చలు రాకుండా ఉండాలి అని అంటే రోజు సన్ స్క్రీన్ SPF 15 ఇంట్లో ఉన్నప్పుడు రాసుకోండి. ఒకవేళ బయట వెళ్తున్నట్టు అయితే SPF 30 కానీ SPF 50 కానీ వాడండి.

4. స్ట్రెచ్ మర్క్స్

చర్మపు చారలు నివారించడానికి వ్యాయామాలతో పాటు సరైన ఆహరం కూడా అవసరం. స్ట్రెచ్ మర్క్స్ సులువుగా ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ చదవండి.

5. జుట్టు రాలిపోవడం

ప్రెగ్నన్సీ తరువాత జుట్టు రాలిపోవడం అనేది అత్యంత సాధారణ విషయం. రాలుతున్న జుట్టుని చూసి మనం పడే బాధ మాటల్లో చెప్పలేము. ఏ మహిళకైనా జుట్టు అనేది సహజమైన అలంకారము. కావున దానిని సంరక్షించుకోవాలి అని అంటే ఈ చిట్కాలను పాటించండి.

1. జుట్టుని ఎక్కువగా దువ్వకండి

2. వారానికి మూడు సార్లకు మించి తలా స్నానం చేయకండి

3. ఆపిల్, బీన్స్, స్ట్రాబెర్రీస్ వంటివి తినడం వలన కుదుర్లు గట్టి పడతాయి.

4. జుట్టుని ఎక్కువ సేపు ముడి వేసి ఉంచకండి

5. ఉల్లిపాయ రసం జుట్టుకి రాస్తే జుట్టు మందంగా మారి రాలడం తగ్గుతుంది

Leave a Reply

%d bloggers like this: