రక్తహీనత (Anaemia) కడుపుతో ఉన్నప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికీ జరుగుతుంది. రక్తహీనత అంటే శరీరంలో రక్త కణాలు తగ్గిపోవడం. ఇది అత్యంత ప్రమాదకరం కావున నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కసారి ఉండాల్సిన మోతాదు కన్నా రక్త కణాలు తక్కువ అయిపోతే శరీరానికి ప్రాణ వాయువు అందక చాలా సమస్యలు వస్తాయి. ఈ సమస్య యొక్క లక్షణాలు పలు విధాలుగా ఉంటాయి. అవేంటంటే…
రక్తహీనత (Anaemia) లక్షణాలు
1. కళ్ళు తిరగడం
2. తల నొప్పి
3. ఊపిరి పీల్చుకోవడం కష్టమవడం
4. గుండె వేగంగా కొట్టుకోవడం
5. పాలిపోయిన చర్మం
6. చెస్ట్ పెయిన్
గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ మందులు వేసుకోకూడదు కాబట్టి రక్తహీనతను సహజంగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఆహార అలవాటును మార్చి పౌష్టికమైన ఆహారం తీసుకోవడం మొదలు పెడితే ఈ సమస్య నుండి సులువుగా బయటపడవచ్చు.
1. విటమిన్ C

విటమిన్ C అధికంగా లభించే ఆహారం తీసుకుంటే రక్త హీనత కలగకుండా చూసుకోవచ్చు. విటమిన్ C శరీరంలో రక్త కణాలు తగ్గకుండా చేస్తుంది. అందువలన ప్రెగ్నన్సీ సమయంలో మరియు ప్రసవం తరువాత కూడా విటమిన్ C అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే రక్తహీనత సమస్య దారికి రాదు.
2. ఐరన్ అధికముగా ఉన్న ఆహారం

ఐరన్ అధికముగా ఉన్న ఆహారం రక్తంలోని కణాలను పెంచుతాయి అని డాక్టర్లు సలహా ఇస్తారు. పచ్చగా ఉండే అన్ని ఆహార పదార్థాలు అంటే ఆకు కూరలు, కొన్ని కూరగాయలలో ఐరన్ నిలువలు అధికముగా ఉంటాయి. గుడ్లు, మాంసం మరియు ఆకు కూరల్లో ఐరన్ శాతము ఎక్కువ ఉంటుంది కనుక ఈ ఆహారం తీసుకోవడం మంచిది.
3. పాలు మరియు పాల ఉత్పత్తులు

మీరు ఐరన్ విలువలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకునే సమయంలో పాలు మరి పాల ఉత్పత్తులకు ఎంత దూరంగా ఉంటె అంత మంచిది. పాలు కాఫీ వంటివి కూడా తీసుకోక పోవడం మరింత మంచిది.