pillala-edugudalaku-ee-aahaaram-athyantha-avasaram

పిల్లల ఎదుగుదలకి అన్ని రకాల పోషకాలు ఉన్న ఆహారం అవసరం. ముఖ్యంగా పిల్లల ఎదుగుదల వారు తినే ఆహరం మీద ఆధారపడి ఉంటుంది కనుక వారికి ఎలాంటి ఆహరం ఇవ్వాలి అని తెలుసుకోవడం తల్లిదండ్రులుగా మన భాద్యత. అందుకే ఆ ఆహారంలో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి, అవి ఎందుకు పనికొస్తాయి  అని తెలుసుకుంటే పిల్లలకు మంచి ఆహారం అందించవచ్చు.

1. పుల్లగా ఉండే పండ్లు

పుల్లగా ఉండే పండ్లు అంటే బత్తాయి, గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ వంటి వాటిలో విన్తమిన్ C అధికంగా ఉంటుంది. అంతే కాకుండా ఇతర ఆహారాలలో ఉండే ఐరన్ నిలువలను పీల్చుకోవడంలో కూడా ఉపయోగపడతాయి.

2. నేరేడు పండ్లు

అన్ని పండ్లలో కంటే నేరేడు పండ్లలో విటమిన్ E నిలువలు అధికంగా ఉంటాయి. ఇవి తినడం నరాలకు, గుండెకు చాలా మంచిది.

3. ఉసిరి కాయ (ఆమ్లా)

ఉసిరి కాయలో విటమిన్ C తో పీచు పదార్థము కూడా అధికంగా ఉంటుంది. అంతే కాకుండా, ఉసిరిలో ఉండే పొటాషియం ద్వారా నరాలు మరియు కండరాళ్లు ధృడంగా మారుతాయి.

4. టొమాటోస్

అందరు టమోటాని వెజిటబుల్ అనుకుంటారు కానీ, నిజానికి అది పండ్ల జాతికి చందినది. టమాటాలో విటమిన్ C మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కంటి సమస్యలు, అజీర్తి, రక్త పోటు మరియు చర్మ సమస్యలను కొంత వరకు దూరంగా ఉంచవచ్చును.

5. క్యారెట్స్

క్యారెట్స్ ఉపయోగాలు అనేకం. వీటిలో కావాల్సినంత పీచు పదార్థాలతో పాటు బీటా కెరోటిన్ కూడా ఉంటుంది.  అది మనం తిన్నప్పుడు విటమిన్ A గా మారి కంటి చూపుని మెరుగుపరుస్తుంది. విటమిన్ A లోపముంటే రేయి చీకటి వచ్చే ప్రమాదం ఉంది.

6. నిమ్మ కాయలు

నిమ్మకాయను మనం అలుసుగా చూస్తాము కానీ దానిలో ప్రయోజనాలు అనేకం. గొంతు సమస్యలు, అజీర్తి, మలబద్ధకం వంటి ఎన్నో సమస్యలను నివారించగలదు. అంతే కాకుండా చర్మానికి, జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మకాయలు తరచుగా తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

7. చిలకడ దుంప

వీటిలో విటమిన్ A మరియు విటమిన్ C అధికంగా ఉంటాయి. అంతే కాకుండా వీటిలో ఉండే ఫైటో కెమికల్స్ రోగనిరోధక శక్తిని పెంచి రోగాలు రాకుండా నివారిస్తాయి.

8. చీజ్

చీజ్ పిల్లలకు అత్యంత అవసరము. పిల్లల మేధస్సుని పెంచుతుంది అని చాలా మంది అంటుంటారు. దీనిలో ఉండే రైబోఫ్లావిన్ శరీరంలో ఉండే ప్రోటీన్లను, కొవ్వుని శక్తిగా మార్చడంలో ఉపయోగపడుతుంది.

9. పెరుగు

పెరుగులో కాల్షియమ్, ఫాస్పారోస్ వంటి సుగుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా మరియు ధృడంగా చేస్తాయి. పాలతో పోల్చుకుంటే పెరుగు సులువుగా అరుగుతుంది

10. చేప

చేపలో ఉండే మంచి కొవ్వు పిల్లల మేధస్సు పెంచడానికి మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

11. చికెన్

చికెన్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఈ ప్రోటీన్లు కండరాళ్ళను పెంచడంలో మరియు బలపరచడంలో ఉపయోగపడతాయి. ఎదిగే పిల్లల శరీరం దృడంగా మారాలంటే చికెన్ తినిపించడం మంచిది.

Leave a Reply

%d bloggers like this: