prathi-bharya-tana-bhartanu-tappakunda-adagalsina-5-prashnalu

మీ పెళ్ళి అయ్యి 3 ఏళ్ళయినా,  30 ఏళ్ళయినా మీ భర్తను అడగాల్సిన ప్రశ్నలు ఎప్పుడు మిగిలే ఉంటాయి. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు మీకు సంతృప్తినిస్తే,  కొన్ని సమాధానాలు మిమల్ని బాధ పెట్టచ్చు. ఏదేమైనా మీ ప్రతి ప్రశ్నకు మీ ఆయన నుంచి సమాధానం మాత్రం కావాలి. మీ ఆయనను  ఈ ప్రశ్నలు కూడా ఒకసారి తప్పకుండా అడగండి…

1.నాలో మీకు నచ్చింది ఏంటి?

మీ ఆయన మిమ్మల్ని చాలా సార్లు మెచ్చుకుని ఉంటాడు. మీరు ఎప్పుడైనా మంచి చీర కట్టుకున్నప్పుడు, లేదా చక్కగా జడ వేసుకున్నప్పుడు….తనకి నచ్చాయని చాలా సార్లు చెప్పివుంటాడు. కానీ మీలో తనకు ఏమి నచ్చిందో చెప్పాడా ?లేదా అయితే ఇప్పుడు వెంటనే అడగండి…

2.నేను లావుగా కనిపిస్తున్నానా?

ఏదైనా కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు అద్దం ముందు చూసుకొని ఇంకా ఏదైనా సందేహం ఉంటే, అందరిని అడిగే ఒకే ఒక ప్రశ్న…”నేను ఈ డ్రెస్సులో లావుగా కనిపిస్తున్నానా?”. మీ స్నేహితులను, ఇంట్లో వాళ్ళందరిని అడిగి ఉంటారు కానీ, మీ ఆయనను  ఎప్పుడైనా అడిగారా? ఈసారి తప్పకుండా అడగండి.

3.నా గురించి గర్వంగా ఫీల్ అవుతారా?

మీరూ మీ ఆయనకు సంతోషం కలిగించచ్చు, ఆనందాన్ని ఇవ్వచ్చు. ఈ విషయాల గురించి మీ ఆయన మీతో చాలా సార్లు చెప్పివుంటాడు. మీ పై తన ప్రేమను వ్యక్త పరిచివుంటాడు. కానీ “నువ్వు నాతో ఉండడం నాకు గర్వంగా ఉంది” అని ఎప్పుడైనా చెప్పాడా? ఇప్పుడు వేంటనే అడిగేయండి.

4.నాలో మీకు నచ్చనివి విషయాలు

మీ ఆయన మిమ్మల్ని ఎప్పుడు పొగడమంటే మీకు ఇష్టం. మీ అయన మిమ్మల్ని ఎప్పుడు మెచ్చుకోవాలి. మీరంటే తనకు ఎంత ఇష్టమో రోజు చెప్పాలి. ఇవన్నీ సరే ఎప్పుడైన అమీ ఆయనను “నాలో మీకు నచ్చని విషయాలు ఏంటి?” అని ఎప్పుడైనా అడిగారా? ఒకసారి ఏమి చెప్తాడో అడిగి చుడండి.

5.మీరు సంతోషంగా ఉన్నారా?

పిల్లల పనులు, ఇంట్లో పనులు, ఆఫీసులో పనులు….రోజులన్నీ హడావడిగా గడిచిపోతుంటాయి. మీరు, మీ ఆయన బాధ్యతలు అన్ని పంచుకుని, అన్ని సజావుగా జరగాలని తాపత్రయపడుతారు. కానీ మీ ఆయన ఎలా ఉన్నాడో, ఎప్పుడైనా అడిగారా? ఒకసారి వీలు చూసుకుని అడగండి.

మీరు కూడా మీ ఆయనను ఈ ప్రశ్నలు అడగాలంటే ఇది తప్పకుండా మీ ఆయనకు share చేయండి.

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: