ముందుగా తల్లి అయినందుకు మా శుభాకాంక్షలు. మీ బాబు ఈ భూమి మీదకు వచ్చే లోపు, మీరు తనకి మీ గర్భంలో ఆరోగ్యమైన మరియు ప్రశాంతమైన వాతావరణం అందివ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మీరు చేయవలసిన మరియు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకోవడం మంచిది.
1. వ్యాయామం తెలివిగా చేయండి
ఒకప్పుడు గర్భవతిగా ఉన్న సమయంలో వ్యాయామం చేయడం వలన గుండె వేగం పెరిగి బిడ్డకు వేడి పెరిగే అవకాశం ఉంది అని చెప్పే వారు. కానీ, ఆ రోజులు ఇప్పుడు లేవు. స్వయంగా డాక్టర్సే ఇప్పుడు ఊపిరి మీద ఆధారపడే వ్యాయామాలు చేయండం ఉత్తమమని సిఫారసు చేస్తున్నారు. ఈ వ్యాయామాలు తల్లికి మరియు బిడ్డకు ఉపయోగకరం అని చెప్తారు. గర్భవతిగా ఉన్న సమయంలో ఎదురయ్యే అనేక సమస్యలను ఇటువంటి వ్యాయామాల ద్వారా అధగమించవచ్చు.
2. కెఫిన్ కి దూరంగా ఉండడం
కెఫిన్ రక్తం ద్వారా గర్భాశయం లోకి ప్రవహించి బిడ్డ గుండెకు హాని చేయగలదు. కొన్ని సార్లు అధిక మోతాదులో కెఫిన్ తీసుకోవడం ద్వారా గర్భస్రావం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అందుకని, మీరు పూర్తిగా కెఫిన్ దూరంగా ఉండమని చెప్పట్లేదు కానీ రోజుకి 200mg మించి తీసుకోకపోవడం మంచిది. మీరు ఎంత కెఫీన్ తీసుకుంటున్నారో అంచనా వేసుకొని 200mg మించికుండా చూసుకోండి.
3 ఆ పని వద్దు
డాక్టర్ వద్దు అని చెప్పనంతవరకు, ఏకాంతంగా మీ భర్తతో గడపకపోవడం మంచిదే. సరైన పొజిషన్స్ తెలుసుకొని నిర్మొహమాటంగా అలా పాలు పంచుకోవచ్చు. కొంత మంది గర్భవతిగా ఉన్న సమయంలో దానిజోలికి వెళ్ళకూడదు, బిడ్డకు ప్రమాదం అని చెప్తారు. కానీ అది పచ్చి అబద్దం. కావున, డాక్టర్ వద్దని చెప్పే వరకు, మీకు ఇబ్బంది లేనంత వరకు హాయిగా ఆ విధంగా అలా చేసుకోవచ్చు.
4. పెంపుడు జంతువులకు దూరంగా ఉండండి
ఇది కొంత వరకు చేయకూడని పని. పెంపుడు జంతువుల వలన అనుకోని ప్రమాదాలు జరగవచ్చు. అంతే కాకుండా, పిల్లి వ్యర్థ పదార్థాలలో ఫెలైన్ అని ఒక బాక్టీరియా ఉంటుంది. అది శరీరానికి హానికరం. అందువలన సాధ్యమైనంత వరకు పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం మంచిది.
5. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం
ఈ విషయం మన అందరికి తెలుసు కానీ చేస్తుంటాము. గర్భవతిగా ఉన్నపుడు కూడా వీటిని స్వీకరిస్తే బిడ్డకు కొన్ని మానసిక లేదా శారీరిక రుగ్మతులతో జన్మించవచ్చు. ధూమపానం మరియు మధ్యపానం వలన బిడ్డకు కలిగే కొన్ని వైకల్యాలు ఏమిటంటే శరీరక వైకల్యం, మానసిక వైకల్యం, బిడ్డ తక్కువ బరువుతో జన్మించడం, జన్మించిన తరువాత ఎదుగుదల నెమ్మదిగా ఉండడం వంటివి . కావున వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండండి.