బ్రెస్ట్ ఫీడింగ్, తల్లికి బిడ్డకు మధ్య జరిగే చాలా సహజమైన ప్రక్రియ. మీరు చాలా రోజులనుంచి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తు ఉండచ్చు మీకు కొన్ని విషయాలు తెలిసిఉండచ్చు, చాలా మంది మీకు సలహాలు ఇచ్చిఉండచ్చు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మీకు ఇంకా చాలా విషయాలు తెలియాలి. అలాంటి ముఖ్యమైన 5 విషయాలు…
1.మొదట వచ్చేవి పాలు కాదు
డెలివరీ తరువాత కొన్ని రోజుల వరకు మీ రొమ్ములలో నుంచి వచ్చేది పాలు కాదు. పసుపు రంగులో, చిక్కగా ఉండే కొలస్టర్మ్(colustrum) అనే ద్రవం వస్తుంది. దీంట్లో అప్పుడే పుట్టిన పిల్లలకు కావల్సిన పోషకాలు, ఆంటీబాడీస్ ఉంటాయి. డెలివరీ తరువాత 5 రోజులనుంచి పాలు వస్తాయి.
2.నిప్పల్స్ నుంచి రక్తం రావచ్చు
కొన్నిసార్లు నిప్పల్స్ నుంచి రక్తం రావచ్చు. ఇది అందరికి సహజంగా జరుగుతుంది. శరీరంలో జరిగే హార్మోన్ల వుత్తపతి వలన ఇలా జరుగుతుంది. డాక్టర్ సలహా తో క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్ కానీ వాడండి.
3. బరువు తగ్గుతారు
మీరు పాలు ఇచ్చిన ప్రతి సారి 500-600 క్యాలోరీస్ ఖర్చవుతాయి. అంటే డెలివరీ తరువాత పిల్లలకు పాలు ఇచ్చే దశలో మీరు బరువు తగ్గుతారు. ఆ సమస్య రాకుండా ఉండాలంటే, సమతుల్యమైన ఆహారం తీసుకోండి.
4. పీరియడ్స్ ఆలస్యం అవచ్చు
ప్రెగ్నన్సీ తో ఉన్న 9 నెలలు పీరియడ్స్ ఉండవు. డెలివరీ తరువాత మీరు ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే పీరియడ్స్ ఇంకొంచెం ఆలస్యం అవచ్చు. కంగారుపడకండి అలా జరగడం సహజం. మీరు ఎన్ని నెలలు పాలు ఇస్తారు అన్న విషయం మీద మీ పీరియడ్స్ ఆధారి పడివుంటాయి.
5. నొప్పిగా ఉండచ్చు
బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న సమయంలో కొన్ని సార్లు నొప్పిగా ఉండచ్చు. రొ మ్ముల్లో పాలు సరిగా పట్టక పోవడం, ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యుండచ్చు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ సలహా తీసుకోండి