mee-gynaecologist-nu-tappakunda-adagalsina-6-prashnalu

ప్రగ్నన్సీ తో ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి… ఏమి తినచ్చు? ఏమి తినకూడదు? ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు? ఇలాంటి ప్రశ్నలు మాత్రమే అడుగుతాం. కానీ మనం గైనకాలజిస్ట్ ను అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు చాలా ఉన్నాయి. అలాంటి తప్పకుండా అడగాల్సిన 6 ప్రశ్నలు ఇవే…..

1.కలవడం గురించి 

ప్రెగ్నన్సీ తో ఉన్న చాలామందికి, భర్తతో కలవడం  గురించి చాలా ప్రశ్నలు, అనుమానాలు ఉంటాయి. కానీ గైనకాలజిస్ట్ ను అడగడానికి ఇబ్బంది పడుతారు. ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు ఏకాంతంగా భర్తతో కలవడం తప్పేం కాదు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీని గురించి అవమానంగా ఫీల్ అవ్వకుండా, మీకున్న ప్రశ్నలను గైనకాలజిస్ట్ ను అడగండి.

2. ప్రైవేట్ భాగాలు 

డెలివరీ అప్పుడు మహిళ గర్భస్థానం చుట్టూ అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. డెలివరీ అప్పుడు ఆ భాగంలో నొప్పి తీవ్రత ఎంత వుంటుంది? స్ట్రేట్చింగ్ (stretching) ఎలా జరుగుతుంది? వీటి గురించి మీకున్న ప్రశ్నలను మీ గైనకాలజిస్టును అడిగి తెలుసుకోండి.

3.గ్యాస్

ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు అరుగుదలలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. దీని వలన అజీర్తి, కడుపులో మంట, వీటితో పాటు గ్యాస్ సమస్య కూడా వస్తుంది. దీని గురించి మీ డాక్టర్ తో చర్చించి తీసుకోవాల్సిన ఆహారాన్ని, తినే వేళలను మార్చుకోవాలి. లేకపోతే సమస్య తీవ్రమవుతుంది. అందుకే ఈ విషయం గురించి మీకు ఏ ప్రశ్నలు ఉన్న మీ గైనకాలజిస్ట్ ను తప్పకుండా అడగండి.

4. ఆ భాగం నుండి ద్రవాలు

ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు సాధారణంగా అందరికి ఇలా జరుగుతుంది. గర్భస్థానం నుండి ద్రవాలు వస్తుంటాయి. ఇవి అక్కడ  మంటను, దురదను, చెడువాసనను కలిగిస్తాయి. దీని గురించి చెప్పడానికి, మాట్లాడడానికి చాలామంది ఇబ్బందిగా, అవమానంగా ఫీల్ అవుతారు. కానీ ఈ సమస్య గురించి మీ గైనకాలజిస్ట్ తో చర్చించి, నివారించుకోవాలి.

5. బరువు పెరగడం

ప్రెగ్నన్సీ తో ఉన్నవాళ్ళందరూ బరువు పెరుగుతారు. మీ ఒక్కరికే కాదు అందరికి సహజంగా జరుగుతుంది. దీని గురించి మీ గైనకాలజిస్ట్ తో తప్పకుండా మాట్లాడండి. మీకున్న ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోండి.

6. మలబద్దకం

ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు అరుగుదలలోని మార్పులు, కొన్ని సమస్యలను తీసుకొస్తాయి. అందులో మలబద్దకం అందరికి ఎదురవుతుంది. దీని గురించి మీరు అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే ఆహారం మార్చుకుంటే ఈ మలబద్దకం సమస్య తగ్గుతుంది. దాని గురించి మీ గైనకాలజిస్ట్ తో తప్పకుండా మాట్లాడండి. 

Leave a Reply

%d bloggers like this: