mee-sareeram-andanga-maaradaniki-rose-water-okkati-chaalu

రోస్ వాటర్ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. చాలా కాలాలుగా మన పూర్వీకుల దగ్గరనుంచి   రోజ్ వాటర్ వాడేవారు. దీని గొప్పదనం మొట్టమొదటగా  ఈజిప్ట్ లో తెలుసుకున్నారు అని అంటారు. ఈ అద్భుతమైన ప్రాడక్టు సులువుగా దొరికే చర్మానికి అమృతం లాంటిది. అందుకే ప్రతి భారతీయ  మహిళా దీనిని వాడాలని పెద్దలు సూచిస్తారు. 

చర్మంకి రోజ్ వాటర్ ఎలా ఉపయోగపడుతుందంటే…

1. రోస్ వాటర్ చర్మం యొక్క pH విలువలు సమంగా చేసి చర్మాన్ని లేతగా ఉంచుతుంది.

2. దీనిలో యాంటీ ఇంఫ్లమ్మెటరీ గుణాలు ఉంటాయి. అవి చర్మం మొద్దుబారకుండా, ఎర్రగా కాకుండా చేసుకుంటాయి. అంతే కాకుండా మొటిమలు వంటివి రాకుండా కూడా కాపాడుతాయి.

3. రోస్ వాటర్ అత్యద్భుతమైన క్లీనింగ్ ఏజెంట్. చర్మ రంద్రాల లోపల వరకు వెళ్లి శుభ్రం చేయగలడు. ఏవేవో పేస్ క్రీములు వంటి వాడడం కంటే రోజు రోస్ వాటర్తో ముఖం కడుక్కోవడం చాలా సులువైన పని.

4. అంతే కాకుండా రోస్ వాటర్ చర్మాన్ని తడిగా కూడా ఉంచగలదు. దీని వలన డ్రై స్కిన్ అనేది మీ చెంతకు రాదు.

5. రోస్ వాటర్ గాయాలను కూడా నయం చేయగలదు.

6. దీనిలో ఉండే యాన్తి బాక్టీరియా లక్షణాలు చర్మం యొక్క కణాలను తొందరగా ఉత్తేజం చేసి మంచి కాంతిని ఇస్తాయి.

7. రోస్ వాటర్ లోని సుగుణాలు చర్మంలో రక్త ప్రవాహం పెంచి ఆరోగ్యాంగా ఉంచగలవు. అంతే కాకుండా ఇది చర్మం సాగడాన్ని, ముడతలు రావడాన్ని తగ్గిస్తాయి.

8. రోస్ వాటర్ యొక్క మంచి సువాసన ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని పరిశోధనలో తేల్చారు.

రోస్ వాటర్ ని ఎలా వాడాలి

దూదిని రోస్ వాటర్లో ముంచి ముఖానికి మృదువుగా మర్దన చేసుకోండి. ఫ్రిడ్జిలో పెట్టి తీసిన రోస్ వాటర్ మరింత ఉపయోగపడుతుంది. కాళ్ళ కింద నల్లటి వలయాలను, మొటిమలను మరియు నల్లటి మచ్చలను నివారిస్తుంది.

సన్ ట్యాన్ మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది

మీరు రోజు వాడే పేస్ వాష్తో కలుపుకొని వాడితే చర్మం మృదువుగా మారుతుంది. సన్ ట్యాన్ వెళ్లగొట్టడానికి కొంచెం నిమ్మరసంలో రోస్ వాటర్ కలుపుకొని ముకహానికి పూసుకుని 15 నిమిషాల తరువాత ముఖం కడుక్కుంటే ముఖహం కాంతివంతంగా మారుతుంది. 

అంతే కాకుండా, రోజు వాటర్ని నీళ్లలో కలిపి స్నానం చేయడం ద్వారా ఒత్తిడి కూడా తగ్గుతుంది. చర్మానికి విశ్రాంతి లభిస్తుంది.

Leave a Reply

%d bloggers like this: