pillalu-puttina-taruvatha-tappanisariga-konalsina-7-vastuvulu

 మీరు పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో మాకు తెలుసు. గర్భవతిగా ఉన్నప్పుడే పిల్లలకు పేర్లు అనుకునేసుంటారు, సంవత్సరం వరకు పిల్లలకు కావాల్సినవన్నీ కొనేసుంటారు. కానీ ఈ అత్యంత అవసరమైన వస్తువులను కొన్నారా?. ఈ రోజుల్లో ఇవి లేకుండా పిల్లల పెంపకపం  పూర్తి అవదు. కాబట్టి అవేంటో తెలుసుకోండి.

1. కెమెరా

పిల్లలు పెద్దయ్యాక బుజ్జి నువు మొదట పుట్టగానే ఇలా ఉన్నావ్ అని చూపించాలంటే కెమెరా ఉండాలి. కెమెరా అంటే ఫోటోలు తీసా మెషిన్ కాదు, జ్ఞాపకాలను సమకూర్చే ఫ్రెండ్. మీ పిల్లల ప్రతి రోజు జ్ఞాపకంగా మార్చుకోండి, ప్రతి మధురక్షణాన్ని కెమెరాలో బందించండి.

2. డైపర్లు

మీ ఇల్లు అందంగా, మీ బట్టలు భద్రంగా, మీ బంధువులు విసుక్కోకుండా ఉండాలి అని అంటే తప్పనిసరిగా డైపర్లు ఉండాలి.  గుడ్డతో చేసిన డైపర్లు కానీ కాటన్ డైపర్లు కానీ ముందుగానే కొని పెట్టుకోండి. వంటింట్లో ఉప్పు, చిన్న పిల్లలున్న ఇంట్లో డైపర్లు ఎప్పుడూ అయిపోకూడదు.

3. బేబీ సీట్

మీ కారులో బేబీ సీట్ ని తప్పనిసరిగా ఉంచుకోండి. ప్రయాణాల్లో పిల్లల జాగ్రత్తను దృష్టిలో ఉంచుకొని ఇవి తప్పకుండా కొనుక్కోండి.

4. బేబీ క్యారియర్

మీరు మళ్ళీ స్కూల్ బ్యాగ్ మోయాల్సిన సమయం వచ్చింది. కానీ ఒకటే తేడా, ముందు బుక్కులు ఉండేవి ఎప్పుడు మీ ప్రాణ సమానమైన బిడ్డ ఉంటాడు. పిల్లలను ఎత్తుకొని పనులు చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇవి ఉంటె పిల్లల భద్రతకు లోటు రాదు. అంతేనా, మీ పిల్లడు మీకు హత్తుకొనే ఉండడం వలన వారి జాగ్రత్త గురించి ఆలోచన మరియు భయం ఉండవు

5. స్ట్రోలర్

మీ పిల్లలను సులువుగా మీరు ఎక్కడ వెళ్లినా తీసుకొని వెళ్లాలనుకుంటున్నారా? సాయంత్రం సరదాగా మీ బిడ్డతో పార్కులో తిరగాలనుకుంటున్నారా? ఒక స్ట్రోలర్ కొనుకుంటే మీ కోరిక నిరవేరినట్టే. ఎక్కడ వెళ్లిన పిల్లలను భద్రంగా మరియు సులువుగా తీసుకొని వెళ్లొచ్చు.

6. ఉయ్యాల

మీకు ప్రసవం తరువాత అసలే నిద్రరావడం కష్టం. వచ్చిన కాసేపైనా ప్రశాంతంగా నిద్రపోవాలంటే అప్పుడే పుట్టిన చాలా సున్నితమైన పాపాయి మన పక్కన ఉంటె ఎక్కడ తనకి హాని చేస్తామో అన్న భయంతో నిద్ర రాదు. అందుకే ఒక ఉయ్యాలా కొనుక్కోండి. ఈరోజుల్లో, పిల్లల భద్రత మరియు సౌకర్యం దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ఎన్నో ప్రొడక్ట్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి, ఉయ్యాలని తప్పనిసరిగా కొనుక్కోండి, మీరు మీ బిడ్డ హాయిగా నిద్రపోండి.

7. బేబీ వైప్స్

మీ పిల్లలకు ఎక్కడపడితే అక్కడ స్నానం చేయించడం మంచిది కాదు. కొన్ని కొన్ని సార్లు స్నానం చేయించడం కుదరకపోవచ్చు. అందువలన ఒక ప్యాకెట్ బేబీ వైప్స్ ఎప్పుడూ మీతో ఉంచుకోండి.

Leave a Reply

%d bloggers like this: