pregnancy-tho-vunnappudu-tappakunda-cheyinchukovalsina-5-mukhyamaina-scans

అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు ఏమి జరుగుతుంది?

అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు, హై ఫ్రీక్వెన్సీ ధ్వని తరంగాలు, కడుపు ద్వారా గర్భాశయంలోకి పంపించబడుతాయి. ఈ ధ్వని తరంగాలు గర్భాశయంలోని శిశువును తాకి, ప్రతిధ్వనులగా తిరిగివస్తాయి. వీటి ఆధారంగా కడుపులోని శిశువు యొక్క చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఆ చిత్రంలో, గట్టిగా ఉండే ఎముకలు, తెలుపు రంగులో కనిపిస్తాయి. మెత్తని శరీర భాగాలు బూడిద (gray) రంగులో కనిపిస్తాయి. ద్రవాలు ప్రతిధ్వనులను పంపించవు, అందుకే అవి నలుపు రంగులో కనిపిస్తాయి. ఈ చిత్రం, మరియు రంగుల ఆధారంగా, కడుపులోని శిశువు ఎదుగుదల గురించి అనేక విషయాలు తెలుస్తాయి.

అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు?

1. కడుపులో పిండం ఎదుగుదల

2. శిశువు గుండె చప్పుడు

3. ఏదైనా రక్త స్రావం జరిగితే, ఎందుకు జరుగుతుంది?

4. శిశువు అవయువాలు సరిగా పెరుగుతున్నాయా?

5. శిశువు ఎదుగుదల ఆధారంగా, డెలివరీ తేది తెలుసుకోవచ్చు

తప్పకుండా చేయించుకోవాల్సిన ముఖ్యమైన స్కాన్స్
1.డేటింగ్ అండ్ వైబిలిటీ స్కాన్ (Dating and viability scan)

ప్రెగ్నన్సీ తో ఉన్న మొదటి నెలలో ఈ స్కాన్ చేయించుకోవాలి. ఈ స్కాన్ ద్వారా కడుపులోని శిశువు గుండె చప్పుడు వినచ్చు. గర్భాశయంలో పిండం సరైన స్థానంలో, ఎదుగుతుందా? లేదా?, ఎన్ని పిండాలు ఉన్నాయి, రక్థ స్రావం ఎందుకు జరుగుతుంది? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవచ్చు.

2. నూచల్ ట్రాన్స్లుసెన్సీ స్కాన్ (Nuchal Translucency Scan)

ప్రెగ్నన్సీతో ఉన్న 11 వారాల తరువాత ఈ స్కాన్ చేయించుకోవాలి. శిశువు మెడ వెనక భాగంలోని, చర్మం కింద కొన్ని ద్రవాలు ఉంటాయి, వీటినే నూచల్ ట్రాన్స్లుసెన్సీ అంటారు. స్కాన్ ద్వారా, ఆ ప్రాంతంలో ఉన్న ద్రవాల మందాన్ని తెలుసుకోవచ్చు. ద్రవాలు ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉంటే, బిడ్డ మానసిక క్షిణత (down syndrome) తో పుడతారు.

3. అనోమలీ స్కాన్ (Anomaly Scan)

ఈ స్కాన్ ను ప్రెగ్నన్సీతో ఉన్న రెండవ నెలలో చేయించుకోవాలి. కడుపులో శిశువు కదలికలు, శిశువు శరీరంలోని లోపలి అవయువాలు ఎలా ఎదుగుతున్నాయి?ఏదైనా లోపాలు ఉంటే ఈ స్కాన్ ద్వారా గుర్తించచ్చు.

4. గ్రోత్ స్కాన్ (Growth Scan)

మూడవ నెలలో ఈ స్కాన్ చేయించుకోవాలి. ఈ స్కాన్ ద్వారా కడుపులోని శిశువు, తల చుట్టుకొలత, కడుపు చుట్టుకొలత, తొడ ఎముకు పొడవు తెలుసుకోవచ్చు.

5. డొప్లెర్ స్కాన్ (Doppler Scan)

ఈ స్కాన్ ద్వారా శిశువు ఆరోగ్యం గురించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు. శరీర భాగాలలో రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది? శిశువుకు సరైన ఆక్సిజన్, పోషకాలు అందుతున్నాయా లేదా ? ఇలాంటి విషయాల గురించి ఈ  స్కాన్ లో తెలుస్తాయి.

Leave a Reply

%d bloggers like this: