yedadahilopu-pillala-kosam-intlone-tayaru-chesukogala-7-adbhuthamaina

బాబు/పాప పుట్టిన కొన్ని నెలల వరకు పాలు తాగుతారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వారు ఆహరం తినే స్థాయికి చేరుకుంటారు. అయితే ఈ సమయంలో ఒక తల్లిగా మీకు చాలా సందేహాలు వస్తాయి. పిల్లలు ఎలాంటి ఆహారాన్ని తింటారు, ఆహారాన్ని జీర్ణం చెసుకోగలరా వంటి సందేహాలు మీకు కలగవచ్చు. పిల్లలకు సులువుగా జీర్ణమయ్యే, మీరు ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఆహార పధార్థాలను ఇక్కడ చూడండి….

పాలు-ఓట్స్

పావు గ్లాస్ ఓట్స్‌ను కొంచెంసేపు వేయించి తర్వాత ముప్పావు గ్లాస్ నీళ్ళు కలిపి ఉడికించాలి. ఆ తర్వాత అందులో సరిపడినన్ని పాలు పోయాలి. ఈ మిశ్రమాన్ని 4 నుండి 6 నెలల వయసు గల పిల్లలకు తినిపించచ్చు.

బఠాణీ మిశ్రమం

తాజా  బఠాణీలు కొన్ని తీసుకొని, వాటికి తగినన్ని నీళ్ళు కలిపి మెత్తటి మిశ్రమం అయ్యే వరకు వేడి చేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లార్చి పాప/బాబుకు తినిపించవచ్చు.

బాగా మెదిపిన అరటిపండు

ఈ ఆహారాన్ని సులువుగా తయారు చేసుకోవచ్చు. మొదటగా తగినన్ని మంచి అరటిపళ్ళు తీసుకొని, వాటికి తొక్కలు తీసివేయాలి. ఇలా చేసిన తర్వాత ఆ అరటిపళ్ళను మెత్తగా చేయాలి. బాగా మెదిపిన అరటిపళ్ళను 4 నుండి 8 వారాల వయసు ఉన్న పిల్లలకు తినిపించవచ్చు. ఈ మిశ్రమాన్ని పిల్లలు బాగా ఇష్టంగా తింటారు.

క్యారెట్ మిశ్రమం

ముందుగా తాజా క్యారెట్‌ను తీసుకొని, వాటిని బాగా కడిగి వాటి పైపొరను తీసివేయాలి. ఆ తర్వాత బాగా ఉడకడానికి వాటిని ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత వాటిని బాగా ఉడికించాలి. అప్పుడు వాటిని బాగా మెదిపి మీ పాప/బాబుకు తినిపించవచ్చు.

అవకాడో మిశ్రమం

అవకాడో కాయను తీసుకొని పైపొరను తొలగించి బాగా ఉడకబెట్టాలి. ఆ తర్వాత దాన్ని గుజ్జులా మారేవరకు మెదపాలి. ఆ మిశ్రమాన్ని పిల్లలకు తినిపించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అయితే 4 నెలల కన్నా తక్కువ ఉండే పిల్లలకు ఈ మిశ్రమాన్ని బాగా మెదిపిన తర్వాతనే పెట్టాలి.

స్వీట్ పొటాటో

తాజా స్వీట్ పొటాటోలను తీసుకొని బాగా కడిగి, పైపొరను తీసివేయాలి. అనంతరం, వాటికి సరిపడా నీరు పోసి మరిగించాలి. అవి బాగా ఉడికిన తర్వాత వాటిని వేరు చేసి, మెత్తగా మెదపాలి. బాగా మెత్తగా అవ్వడానికి  బ్లెండర్ సహాయంతో వాటిని ముద్దగా చేయవచ్చు. అనంతరం పాప/బాబుకు తినిపించవచ్చు.

యాపిల్

ఒక యాపిల్‌ను తీసుకొని దానిని నాలుగు బాగాలు చేసి మధ్యలో ఉండే పధార్థాన్ని వేరు చేసి మిగిలిన బాగాన్ని బాగా ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత దాన్ని బాగా మెత్తగా చేసి పిల్లలకు తినిపించవచ్చు. యాపిల్‌ను పిల్లలకు అలవాటు చేస్తే వారి ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని 4 నెలలు పైబడిన పిల్లలకు పెట్టవచ్చు.

Leave a Reply

%d bloggers like this: