appude-puttina-pilalalo-kamerlu-karanalu-rakalu-chikitsa-jagrathalu

అప్పుడే పుట్టిన పిల్లలలో కామెర్లు రావడం సహజం. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు.  అప్పుడే  పుట్టిన పిల్లలలో కామెర్లు ఎందుకు వస్తాయి?  ఎన్ని రకాల కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ పూర్తి వివరాలు తెలుసుకోండి.

కారణం

అప్పుడే పుట్టిన పిల్లలలో వచ్చే కామెర్లను నియోనాటల్ జాండిస్ (Neonatal jaundice) అంటారు. అప్పుడే పుట్టిన పిల్లలలో ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉంటాయి. దాని కారణంగా బిలిరుబిన్ (bilirubin) అధికంగా ఉత్పత్తి అవుతుంది. అయితే పిల్లల కాలేయం, ఈ అధిక మోతాదులో ఉన్న బిలిరుబిన్ను తొలిగించలేదు. అది రక్తంలో అలానే ఉండిపోతుంది, అలా బిలిరుబిన్ రక్తంలో ఉండిపోవడాన్ని హైపర్‘బిలిరుబినేమియా ( Hyperbilirubinemia). ఫలితంగా కామెర్లు వస్తాయి.

రకాలు

1. జాండిస్ ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ (Jaundice of prematurity)

పిల్లలతో అధికంగా ఉత్పత్తి అయ్యే బిలిరుబిన్ను, తొలిగించే స్థాయిలో, వారి కాలేయం ఎదిగి ఉండకపోవడం. ఈ కామెర్లకు కారణం.

2.బ్రెస్ట్ ఫీడింగ్ జాండిస్ (Breastfeeding jaundice)

ఈ రకం కామెర్లు వచ్చినప్పుడు, పిల్లలు తల్లి పాలు తాగలేరు.

3. బ్లడ్ గ్రూప్ మారడం వలన వచ్చే కామెర్లు (Jaundice due to blood group incompatibility)

తల్లికి, బిడ్డకు వేరు వేరు బ్లడ్ గ్రూప్స్ ఉంటే, బిడ్డకు ఈ కామెర్లు వస్తాయి.

లక్షణాలు

1. చర్మం పసుపు రంగులోకి మారిపోతుంది.

2. కామెర్లు, పుట్టిన వెంటనే లేదా 24గంటలలో వస్తాయి.

3. తీవ్రమైన జ్వరం ఉంటుంది.

4. ఎక్కువ సేపు నిద్రపోతారు.

5. ఎక్కువ సేపు ఏడుస్తారు.

6. సరిగా ఆహారం తీసుకోరు

చికిత్సా విధానాలు 

1. ఫోటోథెరపీ – Phototherapy (light therapy)

ఈ చికిత్సా విధానంలో, బ్లూ-గ్రీన్ కాంతిని, పిల్లల మీద పడేలా చేస్తారు. ఇలా చేయడం వలన శరీరంలోని బిలిరుబిన్ నాశనం అవుతుంది. తర్వాత మూత్రం, మలం ద్వారా బయటకు వస్తుంది.

2. ఎక్స్’చేంజ్ ట్రాన్స్’ఫ్యూషన్ – Exchange transfusion

ఈ విధానంలో, కామెర్లను నయం చేయడానికి ,పిల్లల్లోని రక్తాన్ని మారుస్తారు. ఈ చికిత్సా విధానాన్ని, పిల్లలలో కామెర్లు తీవ్రమైనప్పుడు చేస్తారు.

3.ఇంట్రావెనస్ ఇమ్మ్యూనోగ్లోబులిన్ – Intravenous immunoglobulin

తల్లి బిడ్డ బ్లడ్ గ్రూపులు మారడం వలన, వచ్చే కామెర్లకు ఈ చికిత్స చేస్తారు. ఇమ్మ్యూనోగ్లోబులిన్ ను పిల్లలలోకి ఇంజెక్ట్ చేస్తారు. 

Leave a Reply

%d bloggers like this: