swatantra-dinotsavam-nadu-mee-pillalaku-tappakunda-choopinchalsina-5-goppa-cinemalu

స్వతంత్ర సమరంలో ఎంతో మంది ప్రాణాలు కూడా లెక్క చేయకుండా చేసిన పోరాటమే మనం ఈరోజు ఇలా ఉండడానికి కారణం. ఇంత స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదించిన వారికి మనం చేయగల్గిందల్లా ఈ గొప్ప రోజున వారిని స్మరించుకోవడమే, మీ పిల్లలకు వారి గురించి తెలియ చేయడమే. పిల్లలకు భారతీయ గొప్పదనం మాటల్లో కంటే సినిమాల ద్వారా చెప్తే బాగా అర్థమవుతుంది కాబట్టి స్వతంత్ర దినోత్సవం నాడు మన పిల్లలకు తప్పకుండా చూపించాల్సిన సినిమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము.

1. అల్లూరి సీతారామరాజు

మన తెలుగు వారు అయిన అల్లూరి సీతారామరాజు మన్యం సమరయోధుడిగా సమర శంఖం పూరించి బ్రిటిషు వారి గుండెల్లో మరణ భయం కలిగించారు. ప్రజల స్వతంత్రం కోసం పోరాడుతూ తన తుది శ్వాస విడిచారు. గుండెల్లో తూటాలు దిగుతున్నా గొంతులో వందేమాతరం అన్న మాట మాత్రం ఆపలేదు. అంతటి మహా వీరుడి కథను కళ్ళకు కట్టినట్టు చూపించే చిత్రం అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు పాత్రకు జీవం పోశారు తద్వారా చరిత్రలో నిలిచిపోయే సినిమాని ప్రేక్షకులకు అందించారు.

2. బొబ్బిలి పులి

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అనే పాట ఎవరైనా వినకుండా ఉండుంటారా. అంత గొప్ప పాట స్వర్గీయ తారక రామారావుగారు నటించిన బొబ్బిలి పులి సినిమాలోనిది. ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా, నీ తల్లి మోసేది నవ మాసాలేరా కానీ ఈ తల్లి (భూమి) మోయాలి కడవరకు రా కట్టే కాలే వరకు రా, ఇంతటి గొప్ప మాటలు ఉన్న బొబ్బిలి పులి సినిమాను మీ పిల్లలకు తప్పకుండ చూపించండి.

3. భారతీయుడు

బ్రిటిషు వారు స్వతంత్రం ప్రకటించిన తరువాత కూడా మన భారత దేశాన్ని పీక్కు తింటుంటున్న లంచగుండెలను హతమార్చే ఒక భారతీయుని కథ. అతనికి దేశమా, కొడుకా అని అడిగితే దేశానికీ ద్రోహం చేస్తున్న కన్న కొడుకునే చంపిన ఒక భారతీయుడి కథ. మీ పిల్లలకు నిజాయితీ విలువ తెలియాలంటే భారతీయుడు సినిమా తప్పకుండా చూపించండి.

4. ఖడ్గం

మతం అన్నది మాటే కానీ అన్ని మతాలను సమానంగా చూసే భరతమాత గొప్పదనం వివరించిన అద్భుతమైన చిత్రం ఖడ్గం. అందరు కలిసి మెలసి ఉండాలని చెప్పే గొప్ప చిత్రం ఖడ్గం. కుల మత పిచ్చిని ఖడ్గంతో ప్రక్షాళన చేయమని బోధించే మంచి సందేశాత్మక చిత్రం ఖడ్గం.

5. శంకర్ దాదా జిందాబాద్

గాంధీజీ అంటే స్వతంత్రం రోజు మాత్రం స్మరించుకునే పేరు కాదు. గాంధిజీ అంటే ఆయన నేర్పిన విలువలు, ఆయన చెప్పిన మాటలు – సత్యం అహింసా. ఈ రోజుల్లో గాంధీ జయంతి అంటే డ్రై అని అంటున్నారు. అంతగా దిగజారిపోయాం. తిరిగి గాంధీజీ గారి గొప్పదనం, ఆయన మాటలలో విలువను వివరించిన అద్భుతమైన చిత్రం శంకర్ దాదా జిందాబాద్. మీ పిల్లలు సన్మార్గంలో నడవాలంటే ఈ సినిమా చూపించండి.

Leave a Reply

%d bloggers like this: