kothaga-thallitandrulu-ayina-vaaru-edhurkune-6-pradhana-samasyalu

పిల్లలని పెంచడం ఎంత ఆనందమైన పనో అంతే కష్టమైన పని కూడా. ఇంత వరకు ఎన్నడూ లేనన్ని భాద్యతలు, కొత్తగా వచ్చిన మార్పులు, తెలియని విషయాలు ఇలా ఎన్నో కలిసి కొత్తగా తల్లితండ్రులు అయిన వారిని ఇబ్బందిపెడతాయి. ఇప్పుడు దాదాపు ప్రతి తల్లిదండ్రులు పిల్లలను కన్న కొత్తలో ఎదుర్కునే సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. కచ్చితంగా ఈ సమస్యలు మీరు కూడా అనుభవించి ఉంటారు. అవేంటో చూడండి.

1. భార్య భర్తల మధ్య చిన్న గొడవలు

కొత్తగా తల్లి అయిన భార్యలు రోజుకు ఒక్కసారైనా తన భర్తకు విడాకులు ఇవ్వాలి అన్నంత కోపం వస్తుంది. పిల్లల కొత్తగా పెరిగిన మీ పనులని అర్థం చేసుకోకుండా ఉన్నపుడు భర్త పైన విపరీతమైన కోపం వస్తుంది. అదేదో పిల్లల పని మొత్తం మీరా చేయాలి అన్నట్టు భర్త ప్రవర్తించినప్పుడు ఆ కోపం మరింత ఎక్కువవుతుంది. ఇలాంటి సమయంలోనే భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. కానీ, ఒకటి గుర్తుపెట్టుకోండి, భర్త కూడా కొత్తగా పెరిగిన ఆర్ధిక బరువుని మోస్తున్నాడని, మీ సంతోషం కోసం కష్టపడుతున్నాడని.

అలాగే భర్తలు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఏడుస్తున్న పాపాయిని 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని అంటే అంతే సులువైన విషయం కాదు. ఇలాంటి సమయంలో భార్య ఒక మాట అన్నా అర్థం చేసుకొని సర్థుకుపోండి, ఆలా కాకుండా మాటకి మాట పెంచుకుంటే పోతే ఇద్దరికీ మనశాంతి ఉండదు.

2. ఆకలి – అలకలు

పిల్లలకి ఆహరం తినిపించడం అంత సులువైన పని కాదు. చందమామని ఇస్తా అని చెప్పిన తినరు. కానీ ఆకలి వేస్తె ఏడుస్తారు. ప్రాణానికి ప్రాణమైన మన బిడ్డలు ఏడుస్తుంటే మనం చూడగలమా? కష్టం కదా. ఈ విషయంలో కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ పిల్లలని బుజ్జగించి కడుపునిండా ఆహారం పెట్టండి. పిల్లలు ఒక్కోసారి వారికి నచ్చిందే కావలి అని అంటారు, వాళ్ళ కోరికలు రోజు రోజుకి మారిపోతుంటాయి, మీరు దానిని అర్థం చేసుకొని పిల్లలకు ఎదో విధంగా కడుపు నింపండి. పైన ఫొటోలో ఒక తండ్రి ఎంత ముద్దుగా తన బాబుకి తినిపిస్తున్నాడో చుడండి.

3. బాత్రూం వెళ్లడం నేర్పించడం 

పిల్లలు ఒక రోజు లేచి, ఈరోజు నుంచి నేను పంట్లో కూర్చొను, బాత్రూమ్కి వెళ్తా అని చెప్పారు. మనమే అలవాటు చేయాలి. ఇది చెప్పినంత సులువు కాదు కానీ అనుకున్నంత కష్టం కూడా కాదు. నిదానంగా రోజుల్లోనే నేర్చుకునేస్తారు. టాయిలెట్ మీద పిల్లలకు ఇష్టమైన ఒక సూపర్ హీరో బొమ్మ వేయడం, ఎక్కడ కూర్చుంటే కారులో ఒక రౌండ్ వేయిస్తా అని చెప్పడం కొత్త వరకు పిల్లలను మోటివేట్ చేస్తాయి.

4. ఏడుపు సునామి

పిల్లలకు ఏడ్చడం చాలా ఇష్టమనుకుంటా.అనుకోని సమయాలలో అనుకోని పరిస్థితులలో పిల్లలు ఏడవడం మొదలు పెట్టేస్తారు. అన్ని పనులు వదిలి వాళ్ళని బుజ్జగించడానికి ప్రయత్నించాల్సి వస్తుంది. పెళ్లిళ్లలో, సినిమా హాల్లో పిల్లలు ఏడవడం మొదలు పెట్టిన ఇబ్బంది పడకండి, ఎందుకంటే చిన్న పిల్లలు పద్దతిగా ఉండాలని ఎవరు ఎక్సపెక్ట్ చేయరు. పిల్లలు ఏడుస్తున్నారంటే వారికి ఎదో అసౌకర్యం కలిగిందని అర్థం, దానిని తెలుసుకొని వెంటనే ఏడుపు ఆపడానికి ప్రయత్నించండి.

5. పిల్లలు ఎప్పుడు నిద్రపోతారో వాళ్ళకే తెలీదు

నేను ఎంత ఎదవనో నాకే తెలీదు అని పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు, పిల్లలు ఎప్పుడు నిద్రపోతారో వాళ్ళకే తెలీదు. పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరంలో తల్లిదండ్రులు చాలా నిద్ర కోల్పోతారు. పిల్లలు పుట్టిన తరువాత  తప్పించలేని సైడ్ ఎఫెక్ట్ నిద్ర తగ్గిపోవడం. కానీ దీనిని కింది విధంగా చేస్తే కొంత వరకు ఎక్కువ సమయం మీకు నిద్రపోవడానికి లభిస్తుంది.

పిల్లలు నిద్రపోవడానికి మంచి వాతావరణం కల్పించండి

మీరు కూడా చిన్న నాప్స్ తీసుకోండి. పిల్లలే కాదు మీరు కూడా చిన్న చిన్న నాప్స్ తీసుకోవడం మంచిది.

మీ భర్త మీరు పిల్లలను ఎత్తుకునే భాద్యతను పంచుకోండి.

6. ఆరోగ్యం బాగాలేకపోతే

మనం అన్నీ కంట్రోల్ చేయలేము . ఎంత జాగ్రత్తగా ఉన్న పిల్లలు అప్పుడప్పుడు అనారోగ్యానికి గురవుతుంటారు. అంత మాత్రం మన తప్పిదం వలన పిల్లల ఆరోగ్యం పాడైపోయింది అనుకోవడం పొరపాటే. పిల్లలకు రోగనిరోధిక శక్తి పెరగడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి పిల్లలు ఆరోగ్యం బాగాలేకపోతే మిమ్మల్ని మీరు నిందించుకొని బాధపడకండి. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు, తిరిగి నార్మల్ అయ్యేవరకు మరింత శ్రద్ద వహించండి.

Leave a Reply

%d bloggers like this: