pillala-edhugudhalaku-avasaramaina-mariyu-pillalau-istapade-8-vuthamamaina-aharalu

పిల్లలకు ఏమి తినిపించాలి? అసలు పిల్లలు ఏమి తినడానికి ఇష్టపడుతారు? కొత్తగా అమ్మ అయిన ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్నలు ఉంటాయి. పిల్లల ఆహార విషయంలో చాలా జాగ్రత్తులు తీసుకోవాలి. పిల్లలకు తినిపించడానికి సరైన ఆహారం ఎంచుకోవాలి. ఎందుకంటే పిల్లల ఎదుగుదలలో ఆహారం ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. పిల్లల ఎదుగుదల సక్రమంగా జరగడానికి అవసరమైన ఆహారాలు ఇవే ….

1.పప్పు

పప్పు ను ప్రెషర్ కుక్కర్ లో మెత్తగా ఉడికించి, చక్కర లేదా ఉప్పు కలిపి మీ పిల్లలకు తినిపించండి. ఇది మీ పిల్లలకు చాలా అవసరమైన ఆహారం. దీనిలో ఉండే ప్రోటీన్లు పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతాయి. 4 నెలలు వయసు దాటిన తరువాత ఇది తినిపించడం మొదలిపెట్టండి.

2. అరటిపండ్లు

అరటి పండ్లు పిల్లల కోసం ఒక చక్కని ఆహారం. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడుతారు. అరటి పండు తొక్క తీసి , మెత్తగా నలిపి పిల్లలకు తినిపించండి. అరటి పండ్లలో ఉండే పొటాషియం పిల్లలకు చాలా అవసరం.

3. ఆపిల్

ఆపిల్, అందరూ ఇంట్లో ఎక్కువ తినే పండు. దీనిని పిల్లలు తినే విధంగా తయారు చేసి, తినిపించచ్చు. ఒక ఆపిల్ తీసుకుని పూర్తిగా తొక్క తీసి, మధ్యలో విత్తనాలను తీసేయండి. తరువాత చిన్న ముక్కలుగా కోసి, ప్రెషర్ కుక్కర్ లో స్టీమ్ చేయండి. దీనిని మెత్తగా నలిపి పిల్లలకు తినిపించండి.

4. కూరగాయలు

క్యారెట్, బీట్రూట్, ఆలుగడ్డ, చిలకడ దుంప లాంటి కూరగాయలలో పిల్లలకు ఎదుగుదలకు అవసరమయ్యే, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రెషర్ కుక్కర్ లో స్టీమ్ చేసి, పిల్లలకు తినిపించచ్చు

5. అన్నం

అన్నం లో నెయ్యి, కొంచెం ఉప్పు వేసి, మెత్తగా చేసి పిల్లలకు తినిపించచ్చు. ఇలా పిల్లలకు అన్నం అలవాటు చేయచ్చు. అన్నం లో ఉండే కార్భోహైడ్రేట్స్ , నెయ్యిలో ఉండే ప్రోటీన్స్, పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతాయి.

6. ఇడ్లి

అందరూ చాలా సులువుగా చేసుకుని, ఇష్టంగా తినే టిఫిన్.. ఇడ్లి. దీని పిల్లలకు తినిపించచ్చు. ఇడ్లిని మెత్తగా నలిపి, చక్కర పాలతో కలిపి తినిపిన్చండి.

7.దోశ

దోశ, సులువుగా తయారు చేసి, పిల్లలకు తినిపించకలిగే, ఆహారం. పిల్లలకోసం చేసేటప్పుడు ఎక్కువుగా పులిసిపోయిన పిండిని వాడద్దు. దోశలు పోసేటప్పుడు నూనె తక్కువుగా వాడండి.

8.చపాతీ

చపాతీలు మెత్తగా తయారుచేసి పిల్లలకు తినిపించచ్చు.  గోధుమలలో ఉండే శక్తి, కార్బోహైడ్రేట్స్ చపాతీలా ద్వారా పిల్లలకు అందుతాయి. 

Leave a Reply

%d bloggers like this: