పసి పిల్లలకు కావాల్సిన పోషకాలు, ఆహార అవసరాలు బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారానే లభిస్తాయి. అందుకే అందరూ పసి పిల్లల సరైన ఎదుగుదల కోసం సంవత్సరం వయస్సు వచ్చే వరకు తల్లి పాలు ఇవ్వాలని సలహా ఇస్తుంటారు. కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ మీకు మొదటి సారి అయితే ఈ చిట్కాలను ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ చిట్కాలు మీకే కాదు పాలు తాగుతున్న మీ బుజ్జి పాపాయికి కూడా అవసరం.
1. నొప్పి కలిగితే
మీరు ఇంత వరకు బ్రెస్ట్ ఫీడ్ చేయకపోతే ఈ విషయం తెలుసుకొని. బ్రెస్ట్ ఫీడింగ్ నొప్పిగా ఉంటుంది. ఎందుకంటే మీ బ్రెస్ట్ కి పాలు పట్టడం అనేది అలవాటు లేదు మరియు మీ బాబుకి పాలు ఎలా తాగాలో తెలీదు కనుక నొప్పిగా ఉంటుంది. మొదటి 2 వారాలు చాలా ఇబ్బందిగా ఉన్నా తరువాత అన్నీ సర్దుకుంటాయి. కాబట్టి భయపడకండి, ఏది సహజమే అని తెలుసుకోండి.
2. పిల్లలకు పాలు ఎప్పుడు ఇవ్వాలి
పిల్లలు ఆకలిగా ఉన్నారు అని తెలుసుకోవడం ఎలా? మీ బిడ్డ తన పెదాలను తడుపుకుంటున్నా, చేతి వేళ్ళు నోట్లో పెట్టుకొని సప్పరిస్తున్నా ఆకలిగా ఉందని అర్థం. ఇది గమనించి మీరు పాలు పట్టించాలి. కానీ ఒక్కసారిగా మీకు పాలు సరిగా పట్టుండవు కాబట్టి ఎక్కువ సేపు ఇవ్వలేరు. అందువలన కొంచెం కొంచెం సేపు ఎక్కువ సార్లు ఇవ్వండి. ఇలా చేస్తే మీకు నెక్కువ నొప్పి కలగదు మరియు మీ బిడ్డ ఆకలి తీరుతుంది.
3. మీ పిల్లల ఆకలి తీరిందని తెలుసుకోవడం ఎలా?
మీ బాబుకి సరిపడా పాలు ఇచ్చారు అని మీకు ఎలా తెలుస్తుంది? కొన్ని గుర్తులు గమనించి తెలుసుకోవచ్చు. మొదటి బిడ్డ బరువు పెరుగుతున్నది లేదా అని గమనించండి. బాగా బరువు పెరుగుతుంటే సరిపడా పాలు తనకి అందుతున్నాయి అని అర్థం. ఒక వేల పెరగక పోతే తన ఆకలి ప్రతి సారి తీరలేదు అని అర్థం. రెండవది, బిడ్డ రోజుకి ఎన్ని సార్లు బాత్రూం వెతున్నాడు అని గమనించండి. దీనిని బట్టి కూడా మీ పిల్లల ఆకలి తేలుతుందో లేదో మీకే అర్థమవుతుంది.
4. రొమ్ము పాల శాతం పెంచుకోవడం ఎలా?
ముందుగా చెప్పినట్టు తల్లి కాగానే బ్రెస్ట్ పాలు ఇవ్వడానికి అలవాటు పడుండవు, సిద్ధంగా ఉండవు. అందువలన పాలు ఎక్కువగా రావు. దీనికి ఒకటే సులువైన పరిష్కారం. రోజు మీ బిడ్డకు పాలు పట్టిస్తుండడమే. ఇలా చేయడం ద్వారా మీ బ్రెస్ట్ కి పాలు తయారు చేసుకోవడం అలవాటు అయ్యి ఎక్కువ పాలు శరీరం ఉత్పత్తి చేస్తుంది.
5. తల్లి పాలు మాత్రమే ఉత్తమమైన ఆహారం
మొదటి 6 నెలలు పిల్లలకు కేవలం తల్లి పాలు మాత్రమే ఉత్తమమైన ఆహరం. తల్లి పాలల్లో యాంటీ బాడీస్ మరియు రోగనిరోధక శక్తి పెంపొందించే గుణాలు పిల్లలకు అత్యంత అవసరం. అవి పిల్లల జీవితం ఆరోగ్యాంగా ఉండేలా శరీరాన్ని బలపరుస్తాయి.
6. మీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ద వహించాలి
ఇది అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. మీరు ఆరోగ్యంగా లేకపోతే మీ బిడ్డను బాగా ఎలా చేసుకోగలరు? కాబట్టి మీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ద వహించండి. మీ స్థానాలు నొప్పిగా ఉన్నా లేక ఊది ఉన్నా గోరు వెచ్చని నీటిలో తడిపిన టవల్ తో మర్దన చేసుకోండి. ఇలా చేయడం ద్వారా పాల ప్రవాహం కూడా బాగుంటుంది. అంతే కాకుండా తరచుగా నీరు తాగడం కూడా మర్చిపోకండి.
7. నిపుల్స్ పొడిగా అవ్వకుండా
కొన్ని కొన్ని సార్లు నిపుల్స్ చుట్టూ ఉన్న ప్రదేశం పొడి గ మారి పగుళ్లు ఏర్పడవచ్చు. ఈ సమస్యకు ఆర్టిఫిషల్ క్రీం కన్నా ఆలివ్ పిల్ రాయడం ఎంతో మంచిది. ఇలా చేయడం ద్వారా చర్మం తడిగా మారి పిల్లలకు పాలు ఇవ్వడం సులువుగా హాయిగా మారుతుంది.