అత్తగారు, ప్రతి కోడలి మనసును కదిలించేవుంటుంది. ఆ కదలికకు కారణం ఆనందం అవచ్చు, బాధ అవచ్చు. ఏది ఏమైనా ‘అత్త’ అనే భావన మీ మనసులో అంత సులువుగా చెరిగిపోదు. మాటలక్కర్లేదు ఆవిడ చూపులు చాలు, ఎన్నో విషయాలు అర్ధం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా మీరు ఆవిడ గురించి ఏమనుకుంటున్నారో చెప్పారా? చెప్పాలనే కోరిక ప్రతి కోడలికి ఉంటుంది. అసలు ప్రతి కోడలు అత్తగారికి ఏమి చెప్పాలనుకుంటున్నారో.. చూడండి..
1. ఎవరూ పర్ఫెక్ట్ కాదు
ఇళ్ళు శుభ్రం చేయడం, వంట చేయడం, ఇంటి బాధ్యతలు, పప్పులో ఉప్పు వేయడం ఏదైనా సరే తప్పులు చేయకుండా ఎవరు పూర్తి చేయలేరు. సరే తప్పు నిజంగానే జరిగితే దాన్ని సరిదిద్దుకునే మార్గం తప్పకుండా ఉంటుంది. మీరు కోడలిగా ఉన్నపుడు ఏ చిన్న తప్పు జరగలేదా?
2. గొడవలు నా వళ్ళ కాదు
ఏదో విషయానికి, ఇంకేదో గొడవ జరిగి, అరుచుకుని ఒకర్ని ఒకరు బాధపెట్టుకోవాలనే ఉదేశం లేదు. మీ మీద పై చేయి సాధించాలని ఆశ లేదు. నాకు ఈ కుటుంబం ముఖ్యం. నా భర్తకి తల్లిగా మిమ్మల్ని నేను గౌరవిస్తాను.
3. అత్తా ఒకింటి కోడలే..
మీరు నా లాగే అందరిని వదులుకుని, మీ భర్త కోసం ఈ ఇంటికి వచ్చారు. కొత్త కోడలు ఎలాంటి సమస్యలు ఎదురుకోవాలో మీకు తెలుసు. నన్ను అర్ధం చేసుకుని, మీ అనుభవంతో నాకు సహాయం చేయండి. ఈ గొడవలన్నీ వద్దు
4. మీ కొడుకు ఇప్పుడు నా భర్త
మీకు మీ కొడుకంటే చాలా ప్రేమ, ఆ విషయం నేను అర్ధం చేసుకోగలను. మీ కొడుకును మీరు ఎలా ప్రేమిస్తున్నారో, నేను అంతకన్నా ఎక్కువే తప్ప తక్కువ కాదు. మీకు తన మీద ఎంత అధికారం ఉందొ, నాకు అంతే. ఎందుకంటే ఇప్పుడు తను నా భర్త.
5. ఇది నా ఇళ్ళు కూడా
నేను నా వాళ్ళందరిని వదులుకుని ఇక్కడికి వచ్చింది. ఈ ఇళ్ళు నాది అనే భావనతో, ఈ కుటుంబం మీద ప్రేమతో. నన్ను బయట వ్యక్తిగా చూడకండి.
ఇవన్నీ నిజమని మీకు అనిపిస్తే… SHARE చేయండి