pregnancy-3va-nelalao-tinakudani-pramadhakaramaina-aharalu

ప్రెగ్నన్సీ ప్రతి మహిళ జీవితంలో ఒక అద్భుతమైన అనుభవం. కానీ ప్రెగ్నన్సీ మొదలైనప్పటినుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఆహారం. ప్రగ్నన్సీ తో ఉన్నప్పుడు తినే ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రెగ్నన్సీ 3వ నెలలో ఆ జాగ్రతలు, మార్పులు ఇంకా పెరుగుతాయి. అంతేకాకూండా, మూడవ నెలలో పూర్తిగా మానేయాల్సిన ఆహారాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి…

1. పచ్చి కూరగాయలు

ప్రెగ్నన్సీ సమయంలో చాలా మంది ఎదురుకునే సమస్యలు, గ్యాస్, కడుపులో మంట. వీటికి కారణం అజీర్తి. అందుకే సరిగా అరగని, పచ్చి కూరగాయలను ఈ సమయంలో అసలు తినకూడదు. తాజా కూరగాయలను బాగా ఉడకపెట్టి మాత్రమే ఆహారంగా తీసుకోండి. ప్రగ్నన్సీతో ఉన్నప్పుడు చేయాల్సిన మరియు చేయకూడని పనులేంటో ఒక్కసారి ఇక్కడ చూడండి..

2. కారాలు, మసాలాలు

మీకు తినాలనే కోరిక ఎంత ఉన్నా,  ఇవి తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. వీటివలన కలిగే అల్సర్లు, రక్తంలోని ఫిబ్రిన్ (రక్తాన్ని గడ్డకట్టించే కారకం) స్థాయిలను తగ్గిస్తుంది. దీనివలన రక్తస్రావం ఎక్కువతుంది.

3. అధిక ఉప్పు

ఉప్పు మీ ఆహారాన్ని రుచికరంగా మారుస్తుంది. కానీ ప్రెగ్నన్సీ సమయంలో ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఉప్పు అధికంగా తీసుకోవడం వలన శరీరంలో క్యాలిసియం తగ్గిపోతుంది. అంతేకాకుండా రక్తపోటు పెరిగిపోతుంది. ఇలా జరగడం అంత మంచిది కాదు.

4. కెఫిన్

ప్రెగ్నన్సీ మూడవ నెలలో వీలున్నంత వరకు, కెఫీన్ అధికంగా ఉండే, కాఫీ లాంటి వాటిని తీసుకోకుండా ఉండండి. కెఫీన్ కడుపులోని శిశువుకు చేరి చాలా అనారోగ్యాలకు కారణమవుతుంది. మీకు కూడా నిద్రపట్టకపోవడం, హైపర్ టెన్షన్, రక్థ స్రావం లాంటి సమస్యలు వస్తాయి. 

Leave a Reply

%d bloggers like this: