blue-whale-challenge-pillala-pranalu-teesukuntunna-pramadakaramina-online-game

బ్లూ వేల్ ఛాలెంజ్ అనేది ఒక ఆన్లైన్ గేమ్. అంటే ఇది ఫోన్లో ఆడేది కాదు, ఐస్ బకెట్ ఛాలెంజ్ లాగా దీనిలో కూడా ఆన్లైన్లో మొదలయ్యి శారీరికంగా ఆడే గేమ్. ఇందులో ఏమి ప్రమాదం ఉంది అని అనుకుంటున్నారా? అక్కడే పొరపాటు పడ్డారు. ఈ గేమ్లో ఒక హెడ్ ఆడే వ్యక్తులకు 50 రోజుల పాటు రోజుకు ఒక ఛాలెంజ్ చప్పున ఇస్తాడు. ఆ ఛాలెంజ్ లో చేతులు కోసుకోవడం, ఒంటరిగా స్మశానానికి వెళ్ళడం వంటివి ఉంటాయి. చివరి 50వ ఛాలెంజ్ వచ్చి ఆత్మా హత్య చేసుకోవడం. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం, చాల మంది పిల్లలు ఈ గేమ్ ఆడి ఆత్మహత్య చేసుకున్నారని ఈ మధ్య వెలుగులోకి వచ్చింది.

మొదటగా ఈ గేమ్ 2013 రష్యాలో మొదలయినట్టు సమాచారం. ఫిలిప్ బుడికిన్ అనే ఒక సైకాలజీ స్టూడెంట్ దీనిని కనుగొన్నట్టు చెప్తున్నారు. పోలీసులు ఇతనిని పట్టుకొని ఈ గేమ్ ఎందుకు అని అడగగా అతను ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొంత మంది పనికి రాని వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని ఆత్మహత్య చేసుకోవడం చేయడం ద్వారా ఈ ప్రపంచాన్ని శుభ్రం చేస్తున్నా అని చెప్పాడు. ఇలాంటి విచిత్రమైన మనుషులు బ్రతుకుతున్న ప్రచంచంలో మనం ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ఈ గేమ్ రష్యాలో మొదలయ్యి మెల్ల మెల్లగా ప్రపంచమంతా వ్యాపించింది. ఈ గేమ్ భారిన పడి కేరళలో ఒక 15 సంవత్సరాల యువకుడు ఈ మధ్యనే ఆత్మ హత్య చేసుకున్నట్టు సమచారం. అంతే కాకుండా నిర్దారణ కానీ ఎంతో మంది ఈ గేమ్ బారిన పడి చనిపోయినట్టు సమాచారం.

ఇప్పుడు ఈ గేమ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాము

ఈ గేమ్ ఎలా మొదలవుతుందో ఎవరికీ పూర్తిగా తెలీదు. కానీ ఇలా ఉండచ్చు అని అంటున్నారు. బాగా సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళ దీనికి ఆకర్షితులు అవుతున్నారు అని అంటున్నారు. ఈ గేమ్ 50 రోజుల వ్యవధిలో జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్క ఛాలెంజ్ ఇస్తారు అన్నమాట. మీ ధైర్యం ఉంటె ఈ వీడియో ఒంటరిగా చూడండి అని ఒక దెయ్యాల వీడియో పంపించడం లాంటి వాటితో మొదలయ్యి, మీరు చెయ్యి కోసుకుంటే ఏమైనా చేయగలరు అని పెరిగి, మీరు ఆత్మ హత్య చేసుకోగలరా అంటూ ముగిస్తున్నారు. ఎలా చేస్తున్నారో ఏమో కానీ ఈ గేమ్ బారిన ముఖ్యంగా 13 నుండి 17 సంవత్సరాల వయసు వారు బలి అవుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పెరుగుతున్న టెక్నాలజీ పిల్లలను ఒంటరిగా చేసేస్తోంది. ఎక్కడో ఉన్న వారితో మాట్లాడగల్గుతున్నాము కానీ పక్కనే ఉన్న వారిని పట్టించుకోవడం లేదు. మనిషికి మనిషికి మధ్య సంబంధాలు తగ్గిపోతున్నాయి. టెక్నాలజీ వచ్చిన తరువాత నిజమైన స్నేహాలు కరువైపోయాయి. కాబట్టి మీ పిల్లలను గమనిస్తూ ఉండండి, ఆడుకోమని చెప్పండి, ఇతర పిల్లలతో కలవమని చెప్పండి. ఒక వేల వారికి ఫోన్లు ఇచ్చి ఉంటె పిల్లలు ఏమి చేస్తున్నారో గమనిస్తూ ఉండండి. ఈ ఛాలెంజ్ అనే కాదు సాధారణంగా పిల్లలు స్మార్ట్ ఫోన్లతో ఏమి చేస్తున్నారో గమనించుకోండి.

పిల్లలు చెడు స్నేహాలు, చెడు అలవాట్లు దూరంగా ఉండేలా చూసుకోవాల్సిన భాద్యత మీదే. పిల్లల మీద నమ్మకం ఉండడం తప్పు కాదు, కానీ మంచి చెడు తెలియని వయస్సులో వారిని మంచి దారిలో నడిపించాల్సిన భాద్యత మీదే. మీకు ఈ సమాచారం ఉపయోగంగా అనిపిస్తే అందరికి షేర్ చేయండి. మీకు ఇష్టమైన వాళ్లకు టాగ్ చేయండి.

Leave a Reply

%d bloggers like this: