prasava-samayamlo-mee-daggara-tappakunda-undalsina-5-vastuvulu

మీరు మీ బుజ్జి పాపాయికి జన్మనివ్వడం దగ్గర వచ్చేసరికి మీరు ఎంత ఆనందంగా ఉంటారో అంత జాగ్రత్తగా కూడా ఉండాలి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పకుండ పాటిస్తూ మీకు కావాల్సిన మరియు అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచుకోవడం చాలా అవసరం. మనం ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలో మనకే తెలీదు కనుక కావాల్సినవన్నీ మన బ్యాగ్లో ఉండేలా ముందే చూసుకోవాలి. ఇప్పుడు ఒక పెన్ను పేపరు తీసుకొని ఒక లిస్ట్ తయారు చేసుకోండి.

1. మీకు సంబంధించిన వస్తువులు

మొట్ట మొదటగా బ్యాగ్ లో పేట్టుకోవాల్సినవి బట్టలు. మీరు బాగా సౌకర్యంగా ఉండే ఏమైనా రెండు జతల బట్టలు. మీరు ఎప్పుడు వాడే దిండు మరియు శుభ్రమైన దుప్పటి తప్పకుండ తీసుకోండి. ముఖ్యనగ దిండు ఎందుకంటే హాస్పిటల్లో దిండు ఎత్తు మీకు సరిపోకపోవచ్చు తద్వారా ఇబ్బంది కలగవచ్చు. అంతే కాకుండా రోజు వాడే సోపు, షాంపూ, పేస్ట్ వంటివి తీసుకోవడం మంచిది. అవసరమనుకుంటే మీకు ఇష్టమైన పెర్ఫ్యూమ్ కూడా బ్యాగ్లో పెట్టుకోండి.

2. ఆహరం

ముందుగా చెప్పినట్టు ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందో అంచనా వేయడం కష్టం కాబట్టి మీకు నచ్చిన స్నాక్స్ తీసుకొని వెళ్ళండి. హాస్పిటల్ ఫుడ్ మీకు నచ్చకపోతే ఇంటి నుండి ఆహరం వచ్చేలా ప్లాన్ చేసుకోండి. మీ బందువులకు, స్నేహితులకో ఫుడ్ తెచ్చివ్వమని చెప్పండి. మీ సొంత బాటిల్, ప్లేట్, గ్లాస్ వంటివి మార్చికుపోకుండా పెట్టుకోండి.

3. ఎలక్ట్రానిక్స్

ఎలక్ట్రానిక్స్ అంటే టీవీ, మిక్సీ ఫ్రిడ్జ్ వంటివి కాదు మేము చెప్పేది. మీ ఫోన్, చార్జర్, అవసరమనుకుంటే హెయిర్ డ్రైయర్ వంటివి కూడా తీసుకోండి. అంతే కాకుండా, ప్రతి క్షణాన్ని జ్ఞాపకంగా మార్చగలిగే కెమెరా కూడా తీసుకోండి. మీ మరియు మీ బిడ్డ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు కెమెరాలో బంధించచండి. అంతే కాకుండా బోర్ కొట్టకుండా మ్యూజిక్ సిస్టం ఉంటె తెచ్చుకుకోండి.

4. అప్పుడే పుట్టిన బిడ్డకు అవసరమైన వస్తువులు

మీ బిడ్డ కోసం అవసరమైన వస్తువులను కూడా మీరు ముందే కొనుక్కొని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళడం మంచిది. కాబట్టి, కొన్ని బేబీ నాపీస్, కాటన్ దుప్పటి, ముస్లిన్ స్క్వేర్, పిల్లలకు బట్టలు, స్పాంజ్, క్రీం వంటివి తప్పకుండా తీసుకొని వెళ్ళడం ఆచరణీయం. ఇవన్నీ అవసరమైనవి కనుక అవసరమైనప్పుడు కంగారుపడకుండా ముందుగానే తీసుకోవడం మంచిది.

5. బిడ్డ పుట్టిన తరువాత మీకు అవసరమైనవి

కొత్తగా తల్లి అయిన వెంటనే చాలా కొత్త వస్తువులుఅవసరం వస్తాయి. వా టిలో ముఖ్యమైనవి, మెటర్నిటీ ప్యాడ్స్, సానిటరీ టవల్స్, నర్సింగ్ బ్రాస్, బ్రెస్ట్ ప్యాడ్స్ మరియు చెప్పులు తప్పనిసరిగా ఎత్తుకొని వెళ్ళండి.

ఇప్పుడు మీ బాగ్ కావాల్సిన అన్ని వస్తువులతో నిండిపోయి ఉంది కనుక మీరు నిశ్చింతగా హాస్పిటల్లో ఉంటూ మీకు పుట్టబోయే పిల్లల గురించి కలలు కనవచ్చు. మీ ప్రసవం హాయిగా ఆరోగ్యాంగా జాగాలి అని కోరుకుంటున్నాము. హ్యాపీ డెలివరీ.

Leave a Reply

%d bloggers like this: