pregnancy-samayamlo-fitga-arogyam-vundadaniki-7-margalu

 

ప్రెగ్నన్సీ తో సమయంలో ఫిట్నెస్ ను అలక్ష్యం చేయడం అంత మంచిది కాదు. ప్రెగ్నన్సీ సమయంలో ఫిట్ గా ఉండడం చాలా అవసరం, ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఫిట్ గా ఉండడానికి ఏమి చేయాలి? ప్రెగ్నన్సీకి ముందు ఏమి చేస్తే ఫిట్ గా ఉంటామో మీకు తెలిసేవుంటుంది. కానీ ప్రెగ్నన్సీ సమయంలో ఫిట్ గా ఉండడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం…

1. చక్కర తగ్గించండి

మీరు ప్రెగ్నన్సీ తో ఉన్న సమయంలో, ఆ ఆనందాన్ని సెలెబ్రేట్ చేసుకోడానికి, చాలా స్వీట్స్ మీ దగ్గరికి వచ్చి చేరుతాయి. కాని మీరు వాటికీ దూరంగా ఉండడం మంచిది. తీపి పదార్ధాలు తినడం వలన, వాటిలో ఉండే చక్కర, శరీరంలో ఫ్యాట్ ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే ప్రెగ్నన్సీ సమయంలో ఫిట్ గా ఉండడం కోసం చక్కర అధికంగా ఉండే పదార్ధాలను తినకండి.

2. నీరు తాగండి

ప్రెగ్నన్సీ సమయంలో, హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం. అందుకే శరీరానికి కావలసిన నీరు తప్పకుండా తీసుకోండి. రోజుకు 2 లీటర్ల నీరు తాగాలి.

3. బాగా నిద్రపోండి

శరీరం, మనసు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలంటే, సరైన నిద్ర చాలా అవసరం. ప్రెగ్నన్సీ సమయంలో నిద్ర విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రోజు ఒకే టైం కి నిద్రపోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోండి. మధ్యాహ్నం పూట కూడా కొంత సమయం నిద్రపోవడానికి ప్రయత్నించండి. సరైన నిద్ర మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది.

4.వ్యాయామం

ప్రెగ్నన్సీ సమయంలో చాలా మంది వ్యాయామానికి దూరం అవుతారు. కానీ నిజానికి ఈ సమయంలో వ్యాయామం మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది. అయితే మీరు చేయాల్సిన వ్యాయామాలు ఎంచుకునే ముందు జాగ్రత్తగా ఉండండి. స్ట్రేటచింగ్ లాంటి సులువైన వ్యాయామాలు చేయండి.

5.నిటారుగా నిలుచోండి

ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు చాలా మంది, కడుపు భారం వలన వంగిపోతారు. కానీ అలాకాకుండా నిటారుగా నీలూచోడానికి, నడవడానికి ప్రయత్నించండి. అలా చేయడం మీకు సరైన పోస్టర్ (posture) ని ఇస్తుంది.

6. ప్రోటీన్స్

మీకు ఈ సమయంలో ప్రోటీన్స్ చాలా అవసరం. అందుకే ప్రోటీన్స్ అధికంగా ఉండే పాలు, గుడ్లు, తాజా చికెన్ ఆహారంగా తీసుకోండి. మీకు మాత్రమే కాదు కడుపులో బిడ్డ ఎదుగుదలకు కూడా ప్రోటీన్స్ అవసరం.

7. మెడిటేషన్

ప్రెగ్నన్సీ సమయం మెడిటేషన్, యోగ చేయడం అలవాటు చేసుకోండి. వీటి వలన మీకు స్ట్రెస్ తగ్గి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.   

Leave a Reply

%d bloggers like this: