కొత్తగా-బ్రెస్ట్-ఫీడింగ్-చేస్తున్న-తల్లులకు-ఎదురయ్యే-10-వింత-అనుభవాలు!-xyz

T1; పాలిచ్చే తల్లులకు ఎదురయ్యే 10 చిత్రమైన అనుభవాలు!!

T2; పాలిచ్చే తల్లులకు ఈ 10 విచిత్రమైన అనుభవాలు ఖచ్చితంగా ఎదురవుతాయి!!

T3; 

ప్రసవం జరిగిన తర్వాత పిల్లల ఆకలి తీర్చడం అనేది తల్లి ప్రథమ కర్తవ్యం అవుతుంది. పిల్లలకు పాలు ఇచ్చే క్రమంలో తల్లికి ఎన్నో చిత్రమైన అనుభవాలు ఎదురౌతాయి. అవన్నీ కూడా మహిళలకు కొత్తగాను, వింతగాను అనిపిస్తాయి. వారికి ఎదురయ్యే పరిస్థితులు ఇవే.. ,

పాలు కారడం

మొదటి 2-3 రోజులుబ్రెస్ట్ ఫీడింగ్ చేయడం కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత సులభంగా వస్తాయి. అయితే, మీరు పాప/బాబు సౌండ్ విన్నా, స్మెల్ గమనించినా మీకు తెలియకుండానే పాలు వచ్చేస్తాయి.

సైజులో ఎక్కువతక్కువలు ఉండటం

పాలు ఇవ్వడం మొదలుపెట్టిన కొన్ని రోజులకు వక్షోజాలలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. పాల ఉత్పత్తిలో తేడాలు ఉండటం వల్ల మీ బ్రెస్ట్‌లలో ఒకటి చిన్నగా, మరొకటి ఎక్కువ పరిమాణంలో ఉండవచ్చు. దీని వల్ల మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ భయపడాల్సిన పని లేదు.

మీ ముఖాన్ని లాగడం

పిల్లలు పెరుగుతున్న కొన్ని రోజుల తర్వాత ముందుగా మీ ముఖాన్ని వారు గుర్తుపడతారు. దీంతో మీ ముఖాన్ని వారు లాగుతూనే ఉంటారు. మీ ముఖంతో ఆడుకుంటారు. మీ ముఖం మీదా మీ పిల్లలదా అనేంతగా వారు లాగుతూనే ఉంటారు.

చెవి రింగ్‌లను దూరం చేయడం

స్వతహాగా చిన్నపిల్లల చేతులు పరిణామం పెరిగే కొద్ది చెవి కమ్మలు లాగడం మొదలుపెడతారు. దీంతో మీరు చెవి పోగులను పెట్టుకోవడం మానేస్తారు.

మీ పాపలో జిమ్నాస్టిక్స్‌ను చూస్తారు

పాపకు పాలు పట్టించేటప్పుడు మీ పాపలో దాగివున్న జిమ్నాస్టిక్స్ ప్రతిభను మీరు గుర్తిస్తారు. ఎలాగంటే, పాలు తాగేటప్పుడు తనకు అనుకూలంగా ఉండేట్లు చేసుకోవడానికి పిల్లలు కదులుతూనే ఉంటారు.

కొత్తబాష

మీరు పిల్లలతో మాట్లాడటానికి ఒక కొత్త బాషను ప్రయోగిస్తారు. వారితో మాట్లాడటానికి ఓఓ అని, లేదా లోలో అని మాట్లాడుతారు. వారికి ఈ భాషలో మాట్లాడితేనే అర్థం అవుతుందనే విషయం మీకు కొద్ది రోజులలోనే అవగతం అవుతుంది.

ఆకలితీరిన ముఖం

తల్లికి బాగా తృప్తిగా అనిపించేది ఎప్పుడంటే బిడ్డ కడుపు పూర్తిగా నిండినప్పుడే. బేబి బాగా పాలు తాగి నిద్రపోతుంటే మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆకలి తీరితే బేబి కొన్ని గంటల పాటు నిద్ర లేవరు. ఆ సంధర్భంలో మీరు చాలా ఉల్లాసంగా ఉంటారు.

దుస్తుల ఎంపిక

మీ శరీరంలో వచ్చే మార్పుల వల్ల మీ దుస్తుల ఎంపిక ప్రతి రెండు నెలలకు ఒకసారి మారుతుంది. మీ బ్రెస్ట్ ఎప్పుడూ మారుతుండటం వల్ల మీకు సరిపోయే డ్రెస్ కోసం మీరు అనేక సార్లు షాపింగ్ చేయాల్సి వస్తుంది. గతంలో మీరు కొన్న దుస్తులు మీకు సరిపోకవడం లేదా లూజ్ అవడం మీరు గమనిస్తారు కాబట్టి ఆ సమయంలో తక్కువ దుస్తులు కొనడం మంచిది.

బిడ్డను కదిలించాలా వద్దా

బేబి పాలు తాగుతూ నిద్రపోతే అప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు. ఏంటంటే, బాబును తీసుకెళ్ళి ఊయలలో పడుకోబెట్టాలా లేక అక్కడే పడుకోబెట్టాలా అనె సందేహం రావచ్చు. ఎందుకంటే కదిలిస్తే పిల్లల ఎక్కడ నిద్ర లేస్తారో అనే ఆలోచన ఉంటుంది. ఇలాంటి సమయాలలో చాలా నిదానంగా పిల్లలను తీసుకెళ్ళి ఊయలలో పడుకోబెట్టాలి.

Leave a Reply

%d bloggers like this: