meeku-telivina-bidda-puttalante-ee-aahaaram-tappakunda

ప్రతి ఒక్కరు తమ బిడ్డ అత్యంత తెలివితేటలతో పుట్టాలనుకుంటారు. కానీ అలా జరగాలంటే మనం కడుపుతో   ఉన్నపట్నుండే పిల్లల మెదడు పెరుగుదలకు సంబంధించిన ఆహారం తీసుకోవాలి. ఇంకా వివరంగా చెప్పాలి అని అంటే, మెదడు ఎదుగుదల మరియు ఇంటలిజెన్స్ కి మధ్య సంబంధం తెలుసుకోవాలి.  మెదడు ఎంత ఎదిగితే అంత ఇంటెల్లిజెంట్గా పిల్లలు ఉంటారు. మీకు తెలుసా బిడ్డ 3వ త్రైమాసికం నుండే శబ్ధాలను గుర్తు పెట్టుకోగలడంట. అందుకే గర్భం దాల్చినప్పటినుండి మనం పిల్లల తెలివితేటలు పెంచే ఆహారం తినాలి.

ఇప్పుడు తెలివితేటలు పెంచే అలాంటి ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము.

1. సహజమైన ఫ్యాట్స్ ఉన్న పదార్థాలు

60 నుంచి 70 శాతం మెదడు ఎదుగుదల ఫ్యాట్స్ నుండి జరుగుతుంది అన్న విషయం దృష్టిలో పెట్టుకొని మనం ఆహారంలో ఎక్కువ సహజమైన ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి. అంటే ఎటువంటి ఫ్యాట్స్ అంటే అటువంటివి కావు, ముఖ్యంగా ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచిస్తున్నారా? ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ సన్ఫ్లవర్ మరియు నువ్వుల నుంచి తీసిన నూనెలో అధికంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా అక్రోట్లను (Wal Nuts), ఫ్లాక్స సీడ్స్, సాల్మన్ వంటి వాటిలో లభిస్తుంది.

2. విటమిన్ B9

విటమిన్ B9 అధికంగా ఉన్న పదార్థాలు రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే మీ పిల్లల అద్భుతమైన ఆలోచనా శక్తి మరియు తెలివితేటలతో పుడతారు. అంతేకాకుండా పిల్లలు మానసిక సమస్యలతో పుట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది. విటమిన్ B9 అధికంగా ఆకు కూరల్లో, పుల్లటి పండ్లలో మరియు బ్రోకలీ లో లభిస్తుంది.

3. ఐరన్

గర్భవతిగా ఉన్నపుడు మీకు మతిమరపు రాకుండా చూసుకోవడాం మంచిది. చాలా మంది మహిళలు ప్రెగ్నన్సీ సమయంలో చాలా విషయాలు తొందరగా మర్చిపోతాము అని చెప్తుంటారు. ఆలా జరగకుండా ఉండాలి అని అంటే ఐరన్ అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఐరన్ ఎక్కువుగా ఉన్న ఆహరం తినడం వలన బిడ్డ బరువు తక్కువగా పుట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది. మోంసంలో ఎక్కువ ఐరన్ ఉంటుంది. శాఖాహారులకు ఐరన్ లభించడానికి డ్రై ఫ్రూట్స్, ఆకు కూరలు, బీన్స్ వంటివి రోజు ఆహారంలో భాగం చేసుకోవాలి.

పైన చెప్పినవన్నీ ప్రెగ్నన్సీతో ఉన్న వర్రు వారి పిల్లలు మెదడు  పెరుగుదల కోసం తప్పకుండా తినాలి. మీకు ఈ ఆర్టికల్ ఉపయోగంగా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి.

Leave a Reply

%d bloggers like this: