వాతావరణం మారిన ప్రతి సారి పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు చాలా సహజంగా వస్తాయి. పిల్లలలో చాలా సాధారణంగా వచ్చే ఈ సమస్యలకు, మీరు మీ ఇంట్లోనే వైద్యం చేయచ్చు. అయితే ఇంట్లో దొరికే పదార్ధాలతో ఈ సమస్యలను, ఎలాంటి చిట్కాలతో నయం చేయాలో తెలుసుకోండి…
1. రొమ్ము పాలు (బ్రెస్ట్ మిల్క్)
పసి పిల్లలలో ఏ జబ్బుకైనా, బ్రెస్ట్ మిల్క్ ఒక మంచి మందు. బ్రెస్ట్ మిల్క్ లో పోషక విలువలతో పాటు రోగాలను ఎదురుకునే ఆంటీబాడీస్ కూడా ఉంటాయి. పిల్లలను హైడ్రేట్ గా కూడా ఉంచుతుంది.
2. వెల్లుల్లి – వాము
వెల్లులిని కాల్చి, వాముతో కలిపి చిన్నమూట లాగా కట్టి, పిల్లలు నిద్రపోయే సమయంలో మంచం దగ్గర పెట్టండి. ఇది యాంటివైరల్, యాంటి బాక్టీరియా. పిల్లల్ని జ్వరం, జలుబు, నుంచి రక్షిస్తాయి.
3.అల్లం – తేనె
అల్లం తేనె కలిపి తక్కువ మోతాదులలో పిల్లలకు ఇవ్వండి. ఇది పిల్లలకు దగ్గునుంచి ఉపశమనం ఇస్తుంది.
4. కుంకుమ పువ్వు
కుంకుమ పువ్వును గోరువెచ్చని పాలలో కలిపి, పిల్లలకు నిద్రపోయే ముందు ఇవ్వండి. ఇది పిల్లల దగ్గు, జ్వరాన్ని తగ్గిస్తుంది
5. పసుపు
పసుపు ఆంటిబయోటిక్, అనేక సంవత్సరాల నుంచి వివిధ వైద్యాలలో పసుపును వాడుతున్నారు. పిల్లలకు పసుపుని పాలలో కలిపి ఇవ్వండి. ఏది పొడి దగ్గును, జ్వరాన్ని తగ్గిస్తుంది.
6. తులసి
మనం ఎప్పుడు అందుబాటులో ఉండే తులసిలో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయి. పిల్లలకు ఏదైనా జబ్బు చేసినప్పుడు, వేడినీళ్లలో తులసి ఆకులు వేసి పిల్లలు చేత తాగించండి. జబ్బులను నయం చేయడమే కాకూండా, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.