pregnancy-samayamlo-ettiparisthithilo-tinakudani-5-pandlu

ప్రెగ్నన్సీ సమయంలో ప్రతి విషయంలో,  తీసుకోవల్సిన జాగ్రత్తల మోతాదు కొంచెం పెరగాలి. ఎందుకంటే మీరు ఈ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం, జాగ్రత్త రెండు ప్రాణాలకు బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఆహారం. ప్రెగ్నన్సీ సమయంలో ఏమి తినాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఏమి తినకూడదో తెలుసుకోవడం ఇంకా ముఖ్యం. పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది..ఇది అందరూ చెప్పే మాటే. కానీ ప్రెగ్నన్సీ సమయంలో తినకూడని పండ్లు కొన్ని ఉన్నాయి, అవేంటో మేము చెప్తాము …

1. బొప్పాయి

ముఖ్యంగా పచ్చి లేదా సగం పండిన బొప్పాయిలను, ప్రెగ్నన్సీ సమయంలో అసలు తినకూడదు. పచ్చి బొప్పాయిలో లేటెక్స్ (latex) అనే పదార్ధం ఉంటుంది. గర్భాశయంలో కాంట్రక్షన్స్ (సంకోచాలు) కలగడానికి కారణం అవుతుంది. అందుకే ప్రెగ్నన్సీ సమయంలో బొప్పాయి కానీ, దాంతో చేసిన పదార్ధాలు కానీ తినకండి.

2. ద్రాక్ష

ప్రెగ్నన్సీ సమయంలో ద్రాక్ష తినడం మీద, భిన్న వాదనలు ఉన్నాయి. కొంత మంది డాక్టర్ లు తినమని సలహా ఇస్తే, కొంత మంది వద్దంటారు. ఏదిఏమైనా ప్రెగ్నన్సీ సమయంలో ద్రాక్ష ఎక్కువగా తినడం మంచిది కాదు అని చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి. ద్రాక్ష లో అధికంగా ఉండే కార్భోహైడ్రేట్స్, శరీరంలో గ్లూకోస్ గా మారి, చక్కర శాతాన్ని పెంచుతుంది. దీని వలన పిల్లలకు డయాబెటిక్ షాక్ కు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ద్రాక్ష తొక్కలు కూడా సరిగా అరగవు. ప్రెగ్నన్సీ సమయంలో ద్రాక్ష మరి ఎక్కువగా తీసుకోకండి.

3. అరటి పండ్లు

అరటి పండ్లు, అందరూ ఎక్కువగా తినే పండ్లు. కానీ ప్రెగ్నన్సీ సమయంలో ఎక్కువగా తినడం మంచిది కాదు. అధికంగా ఉండే కార్భోహైడ్రేట్స్ చక్కర శాతన్ని పెంచుతుంది. డయాబెటిస్ తో ఉన్న వాళ్ళు అసలు తినకుండా ఉండడం మంచిది.

4. పైన్ ఆపిల్

పైన్ ఆపిల్ లో బ్రోమేలైన (bromelain) అనే ఎన్జైమ్ ఉంటుంది. ఇది గర్భాశయాన్ని బలహీన పరుస్తుంది. దీని వలన ముందే నొప్పులు రావడం, అబార్షన్ జరిగడం లాంటి ప్రమాదాలు ఉన్నాయి. అందుకే ప్రెగ్నన్సీ సమయంలో పైన్ ఆపిల్ తినకపోవడం మంచిది.

5.ఖర్జురం

ప్రెగ్నన్సీ సమయంలో ఖర్జురం అధికంగా తినకూడదు. వీటిలో ఎక్కువగా ఉండే సహజమైన చక్కరలు. శరీరంలో గ్లూకోస్ గా మారిపోతాయి.  ఈ అధిక గ్లూకోస్ ని శరీర కణాలు గ్రహించలేవు. ఫలితంగా రక్తంలో చక్కర శాతం పెరిగిపోతుంది.

Leave a Reply

%d bloggers like this: