rasini-batti-mee-athagaru-elanti-vaaro-telusuko

మీకు పెళ్ళి అయిన తర్వాత ప్రేమించడం, త్యాగం చెయడం ఎలా నేర్చుకుంటారో ద్వేషించడం కూడా అలానే నేర్చుకుంటారు. మరీ ముఖ్యంగా మీ అత్తగారి విషయంలో మీరు ఎక్కువగా ద్వేషించుకొనే అవకాశం ఉంది. మీరు మీ అత్తగారితో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఒక్కోసారి అపార్థాలు చోటు చేసుకుంటాయి.  అత్తగారితో రిలేషన్ కొనసాగించడం కూడా కత్తి మీద సాము లాంటిదే. మీ అత్తగారి రాశిని బట్టి మీ రిలేషన్ ఎలా ఉందో చెప్పవచ్చు.

కుంభ రాశి

కుంభరాశిలో పుట్టిన అత్తగారు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. వీ రు తమ పిల్లలకు కూడా మంచి స్వేచ్చను ఇస్తారు.  వీరు మనుషులను అంత తొందరగా జడ్జ్ చెయరు. ఒకవేళ మీకు ఇలాంటి అత్తగారు ఉంటే మీరు చాలా లక్కీ.

మీన రాశి

ఈరాశి వారు మిమ్మల్ని తమ పట్ల విధేయులుగా ఉండాలని కోరుకుంటారు కానీ, మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి మీకు అవకాశం ఇస్తారు. వీరికి వ్యక్తిగత అభిప్రాయాలు చాలా ఉంటాయి వాటిని టచ్ చేయకపోవడం మంచిది.

మేష రాశి

ఈ రాశిలో పుట్టిన అత్తగారు అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటారు, వీరు సంకేతాల ద్వారా మీకు చెప్పాల్సింది సీరియస్‌గా చెప్తారు. వీరితో మంచి రిలేషన్ కొనసాగించడం వల్ల వీరి మనసు గెలుచుకోవచ్చు.

వృషభ రాశి

ఈరాశి వారు కొంచెం కఠినంగా ఉంటారు. వారి ఆఙ్ఞలను పాటించాలని వారు కోరుకుంటారు. వీరితో చాలా రోజుల బంధం తర్వాత క్లోజ్ అవ్వగలరు.

మిథున రాశి

ఈరాశిలో పుట్టిన అత్తగారు చాలా మంచివారు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు, మీకు ఎప్పుడూ మద్ధతు ఇస్తుంటారు. ఇలాంటి అత్తగారు దొరికితే మీరు చాలా లక్కీ.

కర్కాటక రాశి

కర్కాట రాశిలో పుట్టిన అత్తగారు కోడలికి అమ్మలా వ్యవహరిస్తారు. మీ వైవాహిక జీబితాన్ని మరింత అందంగా, ఆనందంగా తీర్చి దిద్దుతారు. ఇలాంటి అత్తగారు మీకు వస్తే మీరు ఆనందించవచ్చు.

సింహ రాశి

సింహరాశికి చెందిన అత్తగారు ఒక లీడర్ లక్షణాలను కలిగి ఉంటారు. వీరి కనుసన్నులలోనే అన్ని జరగాలని కోరుకుంటారు అయితే, ఆమెలోని మంచిని మీరు గుర్తు చేస్తూ ఉంటే మీరు తొందరలోనే మంచి కోడలిగా మారిపోవచ్చు.

కన్య రాశి

కన్య రాశికి చెందిన అత్తగారు స్కూల్ టీచర్ లాగా బిహేవ్ చేయవచ్చు. మీరు చేసిన చిన్న తప్పును కూడా చూపించవచ్చు మరియూ ఆమెకు నచ్చినప్పుడు మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. మొత్తానికి ఆమె మిమ్మల్ని చాల ప్రేమిస్తూ ఉంటారు.

తులారాశి

ఏ రాశికి చెందిన అత్తగారు మీకు ఎప్పుడూ సపోర్ట్6గా ఉంటారు. మీ జీవితంలో పూర్తిగా స్థిరపడేవరకు ఆమె మీకు తోడుగా, అండగ ఉంటారు. వీరికి త్యాగం చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది.

వృశ్చిక రాశి

వీరికి కుటుంభ వ్యవస్థ మీద చాల గౌరవం ఉంటుంది. మీరు ఏదైనా తప్పు చేసినా వెంటనే సరిదిద్దుతుంది మరియూ మీకు అండగా ఉంటుంది. ఆమెను ఫాలో అవడం వల్ల మీరు కూడా కుటుంభాన్ని చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతారు.

ధనస్సు రాశి

ఈరాశిలో పుట్టినవారు చాలా ఆశావహ దృక్పతంలో ఉంటారు. మీకు మంచి సలహాలు ఇస్తారు. మీరు ఇలాంటి వారి సాన్నిహిత్యంలో ఉంటే మీ జీవితాన్ని బాగా ఆస్వాదించగలరు.

మకర రాశి

ఈ రాశిలో పుట్టిన అత్తగారికి పర్ఫెక్ట్‌గా ఉండాలనే ఆలోచన ఉంటుంది. దాన్నే మీ నుండి కూడా ఆశిస్తుంది. అయితే ఆమె మీ స్వేచ్చకు ఎటువంటి భంగం కలిగించదు. మీరు ప్రతిదానికి ఆమె సలహా కోరుకోవాలని కూడా అనుకోరు. కాబట్టి ఇలాంటి అత్తగారు దొరికితే మీకు చాలా మంచి జీవితం లభిస్తుంది.

Leave a Reply

%d bloggers like this: