పెళ్ళి అయిన తర్వాత మీకు తెలియకుండానే మీ అత్తగారితో వివాదాలు వస్తుంటాయి. మీరు మంచివారే, మీ అత్తగారూ కూడా మీకు సహాయం చేయాలని చూస్తుంటారు. అయినా అప్పుడప్పుడు కొన్ని అపార్థాలు వస్తుంటాయి. వాటిని అవాయిడ్ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే,
1.నవ్వడం
మీఅత్తగారు ఏదైనా అర్థం లేని పని చేస్తున్నప్పుడు అందులో ఫన్నీగా అనిపించే విషయాన్ని వెతుక్కొని నవ్వండి. అంతేకానీ మీరు చేస్తున్నది తప్పు అని చెప్పకండి. అలా చెప్పడం వల్ల ఆమెతో పాటూ సఫర్ కావల్సి వస్తుంది. జీవితాన్ని చిన్న చిన్న విషయాల వల్ల క్లిష్టంగా మార్చుకోకపోవడం మంచిది.
2.ఎప్పుడు స్పందించాలి
సాధారణంగా అత్తగారు ఒక అథారిటీతో ఉండటం వలన మీరు చేసిన ప్రతి చిన్న పనిలోనూ తప్పులు వెదుకుతారు. వారి నైజం అలాంటిది. కాబట్టి మీరు తెలుసుకోవల్సిన విషయం ఏంటంటే, వారు చెసే కామెంట్స్‌కు ఎప్పుడు స్పందించాలి, ఎప్పుడు స్పందించకూడదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. చాలా పరిస్థితులను అవాయిడ్ చేయడం వల్ల పరిస్థితిని చెక్కదిద్దవచ్చు.
3.మాట్లాడుతుండాలి
ఏ రిలేషన్‌కు అయినా కమ్యునికేషన్ చాలా ముఖ్యం. మాట్లాడకపోతే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయనుకోకండి. ఎందుకంటే, మాటలు లేకపోతే మీ ఉద్ధ్యేశాలు మీ అత్తగారికి అర్థం కావు. ఒకవ్బేళ మీకు నచ్చని పనులు, లేదా మిమ్మల్ని హర్ట్ చేసిన సంఘటనల గూర్చి మీ అత్తగారితో మనసు విప్పి మాట్లాడండి. వారు నిదానంగా మీ దారిలోకి వస్తారు.
4.లిమిట్స్‌ను మార్చుకోకండి
మీ అత్తగారు ఎంత మంచివారు అయిన ఆమెకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ప్రతిసారీ మీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే సున్నితంగా చెప్పండి. మారకపోతే, మీ భర్తకు చెప్పి సమస్యను పరిష్కారం చెసుకోండి. మీకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటుందని ఆమెను గుర్తించేలా చేయండి.
5.వినడం
చాలా మంది కోడళ్ళలో మా అత్తగారికి ఏమీ తెలీయదనే భావన ఉంటుంది. ఈ అభిప్రాయం వలన మీరు మీ అత్తగారి అభిప్రాయాలను పట్టించుకోరు. అయితే, వారి సలహాలన్నీ అవుట్‌డేట్ అయి ఉండవు కొన్ని మంచివి కూడా ఉంటాయి. మొదటగా వారి సలహాలు వినండి మీకు నచ్చితేనే ఫాలో అవండి. కనీసం వారి మాటను ఆలకించినందుకు వారికి సంతోషంగా ఉంటుంది.
6.పరిపక్వత
ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ అత్తగారి వైపు నుండి ఆలోచించండి. ఒకవేళ మీ తప్పు లేనప్పుడు విమర్శ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు మీరు మరింత పరిపక్వతతో ఆలోచించండి సమస్య దానికదే పరిష్కారం అవుతుంది. మిమ్మల్ని భాదించే విషయాన్ని మనసుకు తీసుకోకపోవడం ద్వారా చాలా సమస్యలను అవాయిడ్ చేయవచ్చు.