ee-rojullo-technology-pillalaku-manchi-chestuna-leka-chedu-chestunda

మీ పిల్లలు ఎప్పుడూ ఫోన్లో గేమ్స ఆడ్డుకుంటున్నారా? ఫోన్ మాత్రమే కాదు పెరుగుతున్న టెక్నాలజీ మీ పిల్లలకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని అయోమయంలో ఉన్నారా? ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది ఒక భాగం అయిపోయింది. నిజానికి, టెక్నాలజీని వాడకుండా ఒక్క రోజు కూడా గడపలేము అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలకు కూడా చేతిలో ట్యాబ్, ఫోన్లు పెట్టుకొని ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ వలన కలిగే మంచి చెడు రెండు తెలుసుకుందాము.

టెక్నాలజీ ఎందుకు చెడ్డది కాదు

పిల్లల పరంగా టెక్నాలజీ అంటే గేమ్స్ ఆడే పరికరాలు కాబట్టి అవి పిల్లలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. పిల్లలు ఒక గేమ్ లో నిమగ్నమై ఆడుతున్నారంటే వాళ్ళు చాలా కష్టమైన మరియు అవసరమైన నైపుణ్యం సంపాదించుకుంటున్నారు. అదేమిటంటే, సమయస్ఫూర్తి. నిజమండి, ఒక అధ్యయనం ప్రకారం వీడియో గేమ్స్ ఆడే పిల్లలలో సమయస్ఫూర్తి అధికంగా ఉంటుందని తెలిసింది. వీడియో గేమ్స్ ఆడే పిల్లలు దేనినైనా క్షున్నంగా పరిశీలించగలరు మరియు ఒకేసారి రెండు పనులు చేయగలరు. అంతే కాకుండా వీరికి ఓపిక కూడా ఎక్కువగా ఉంటుంది. వీడియో గేమ్స్ ఆడటం ఇందువలన మంచిది.

చెడ్డదిగా ఎప్పుడు మారుతుంది

అందరికీ తెలిసిన విషయమే ఇది. జీవితంలో ఏది ఎక్కువగా చేసినా మంచిది కాదు. అందుకే పెద్దలు అన్నారు అతి సర్వత్రా వర్జయేత్ అని. ఈ మాట టెక్నాలజీకి కూడా వర్తిస్తుంది. అవసరానికి టెక్నాలజీ వాడటం మంచిది కానీ ప్రతి దానికి టెక్నాలజీ మీద ఆధారపడటం అంత మంచిది కాదు. పిల్లలు ఎక్కువ సేపు ఎలక్ట్రానిక్ పరికరాలతో సమయం గడపడం వలన వారికి బాహ్య ప్రపంచంతో, తల్లిదండ్రులతో మరియు స్నేహితులతో సంబంధాలు తగ్గిపోతాయి. Archives of Pediatrics And Adolescent Medicine నిర్వహించిన ఒక పరిశోధనలో ఈ విషయం ధృవీకృతమైనది. అంతే కాకుండా పిల్లలు బరువు పెరగడం కూడా జరగవచ్చు. ఎక్కువ సేపు టీవీ లేదా ట్యాబ్ వాడటం వలన నిద్రకూడా సరిగా రాకపోవచ్చు. బయట వెళ్లి శారీరిక గేమ్స్ ఆడకపోవడం వలన పిల్లల్ల్లో ఉత్సాహం కూడా తగ్గుతుంది.

దీనిని బట్టి ఏమి అర్థమైంది. టెక్నాలజీ మంచిదా? చెడ్డదా? సమాధానం ఒక్కటే. అతి సర్వత్రా వర్జయేత్. ఆవసరం మేరకు మాత్రమే టెక్నాలజీని ఉపయోగించాలి అని చెప్పి మీ పిల్లలను మంచి మార్గంలో నడిపించండి. రోజుకు కొద్దీ సేపు మాత్రమే వీడియో గేమ్స్ వంటివి ఆడటానికి అనుమతి ఇవ్వండి. అంతే కాకుండా తప్పకుండ స్నేహితులతో వెళ్ళి గ్రౌండ్లో ఆడుకోమని చెప్పండి. చదువుతో పాటు వారి బాల్యం అన్నింటినీ ఆస్వాదించేలా చేయండి.

Leave a Reply

%d bloggers like this: