samavatsaramlopu-pillalaku-assalu-tinipincha

పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి ఎలాంటివి పెట్టకూడదు అని తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. మరీ ముఖ్యంగా సంవత్సరంలోపు పిల్లలకు ఎలాంటి ఆహరం పడితే అలాటివి పెట్టకూడదు. సంవత్సరంలోపు పిల్లలకు కావాల్సిన పోషణ ఎక్కువగా తల్లి పాల నుండే లభిస్తుంది. వారికి సాలిడ్ ఫుడ్స్ ఇవ్వడం  మొదలు పెట్టె సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వారికి అస్సలు తినిపించకూడని ఆహరం ఏమిటో తెలుసుకుందాము.

1. తేనె

తేనె తినడానికి చాలా రుచిగా ఉండే మరియు పోషకాలు ఉన్న ఆహారం. కానీ ఏది చిన్న పిల్లలకు ఎంత ప్రమాదమో మనం ఊహినచలేము, ఎప్పుడూ అనుకోని కూడా ఉండము. తేనెలో బాక్టీరియా బీజాంశం ఉంటుంది, ఇది పిల్లలకి అత్యంత హానికరమైనది. సంవత్సరం దాటిన పిల్లలకు మాత్రమే తేనెను తినిపించాలి.

2. గింజలు

గింజలు మరియు డ్రై ఫ్రూట్స్ అంత సులువుగా జీర్ణం కావు. అంతే కాకుండా అవి గొంతులో అడ్డుపడే ప్రమాదం కూడా ఉంది. కొంత మంది చిన్న పిల్లలకు ఇటువంటి వాటికి ఎలర్జీ కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలు కొంచెం పెద్దవారు అయ్యేవరకు ఇవి తినిపించకపోతే మంచిది.

3. పుల్లని పండ్లు

పుల్లని పండ్లలో మైల్డ్ ఆసిడ్ ఉంటుంది. ఇటువంటివి తింటే పిల్లలకు చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక పుల్లటి పండ్లు అంటే నిమ్మకాయ, బత్తాయి, ఆరంజ్ వంటివి తినిపించకపోతే మంచిది.

4. పచ్చి కూరగాయలు

గట్టిగ మరియు పెద్దగా ఉండటం కారణంగా పచ్చి కూరగాయలను పిల్లలకు తినిపించకూడదు. బాగా ఉడకపెట్టి మెత్తగా చేసి తినిపించడం మంచిది.

5. ఆవు పాలు

సంవత్సరంలోపు పిల్లలకు పొరపాటున కూడా ఆవు పాలు తాగించకండి. పాలలో ఉండే ప్రోటీన్లు మరియు  మినరల్స్ కారణంగా ఆవు పాలు అంత సులువుగా జీర్ణం కావు. అందువలన తల్లి పాలు కానీ ఫార్ములా పాలు మాత్రమే తాగించాలి.

Leave a Reply

%d bloggers like this: