కోలిక్ పెయిన్ (Colic pain):
పసిపిల్లలు కొన్ని సార్లు ఏ కారణం లేకుండా ఏడుస్తారు. దానినే కోలిక్ పెయిన్ (శూల నొప్పి) అంటారు. అప్పుడే పుట్టిన పిల్లలలో, అరుగుదలకు కావాల్సిన ఎంజైములు ఇంకా ఏర్పడి ఉండవు. దీని మూలంగా కడుపులో మెలికలు తిప్పే నొప్పి కలుగుతుంది. ఇది కొన్నిసార్లు చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలా జరిగినప్పుడు పిల్లలు అపకుండా ఏడుస్తూనే ఉంటారు. పిల్లలు పుట్టిన అవరం తరువాత ఈ నొప్పి మొదలవుతుంది. సాయంత్రం 6 – 7 గంటల మధ్య ఎక్కువగా ఏడుస్తారు.
పిల్లలలో ఈ నొప్పిని తగ్గించి, ఏడుపును ఆపడానికి సులభమైన మార్గాలు ఏంటో ఏంటో తెలుసుకుందాం…
1. కాపడం
ఒక మెత్తని బట్ట తీసుకుని, వేడి నీళ్ళలో తడిపి, పిండి. ఆ బట్టను పిల్లల పొత్తి కడుపు మీద మెత్తగా వత్తండి. దీని వలన కడుపులో ఉన్న గ్యాసెస్ బయటకు పోయి, పిల్లలకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.
2.నూనెతో మర్దన
పిల్లల పోతి కడుపు మీద నూనెతో మర్దన చేయండి. దీని వలన పిల్లలలో కోలిక్ పెయిన్ తగ్గడమే కాకుండా, రాకుండా ఉండే అవకాశాలు కూడా తగ్గుతాయి.
3. త్రేన్పులు
పిల్లలకు పాలు పట్టించిన తరువాత, వారికి త్రేన్పులు వచ్చేలా చేయండి. ఇలా చేయడం వలన గ్యాసెస్ బయటకు వచ్చి నొప్పి కలగదు. అలాగే అరుగుదల కూడా బాగా జరుగుతుంది.
4. వ్యాయామం
పిల్లలక్కూడా కొంత వ్యాయామం అవసరం. చిత్రం లో చూపించిన విధంగా, పిల్లలను వెల్లకిలా పడుకోబెట్టి, మోకాళ్ళను వంచండి. ఇలా చేయడం వలన కడుపు మీద వత్తిడి పడి, గ్యాసెస్ బయటకు వెళ్ళిపోతాయి. కోలిక్ పెయిన్ తగ్గుతుంది.
5. వేడి నీళ్ళ స్నానం
పిల్లలకు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించడం చాలా మంచిది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. కోలిక్ పెయిన్ తగ్గుతుంది.
6.సరైన సమయంలో పాలు పాటించడం
పిల్లలకు రోజు సరైన వేళలో, పాలు పట్టించడం చాలా అవసరం. లేకపోతే కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. కోలిక్ పెయిన్ కు దారి తీస్తుంది.