pregnancy-vunna-modati-moodu-nelalu-tinakudani-5-pramadhakaramaina

ప్రెగ్నన్సీ మొదటి మూడు నెలలు చాలా కీలకమైన సమయం. ప్రెగ్నన్సీ మొదటి మూడు నెలలో గర్భస్రావానికి గురవడానికి 70 శాతం అవకాశం ఉంది. ఈ సమయంలో మీతో పాటు కడుపులోని బిడ్డకోసం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క తప్పు జరిగిన అది పిల్లల మీద శాశ్వతమైన దుష్ప్రభావాన్ని మిగులుస్తాయి. అందుకే ఈ సమయంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.. అవేంటో తెలుసుకోండి..

1. పైన్ ఆపిల్, బొప్పాయి

 

ప్రెగ్నన్సీ మొదటి మూడు నెలలలో, ఈ రెండు పండ్లు ఆహారంగా తీసుకోవడం, చాలా ప్రమాదం. ఈ రెండు పండ్లు, గర్భాశయంలో సంకోచాలను కలిగిస్తాయి. అంతేకాకుండా గర్భస్రావం కలిగే అవకాశాలను పెంచుతాయి.
2. పచ్చి కూరగాయలు

ప్రెగ్నన్సీ సమయంలో కూరగాయలను తినడం మంచిదే, కానీ పచ్చి కూరగాయలను తినడం చాలా ప్రమాదం. అవి అరుగుదల సమస్యకు కారణం అవుతాయి. అందుకే ఈ సమయంలో ఉడకపెట్టిన కూరగాయలను మాత్రమే తినండి.

3. పచ్చి గుడ్లు, మాంసాహారం

ప్రెగ్నన్సీ మొదటి మూడు నెలలో, పచ్చిగా తినకూడని ఆహారాలలో గుడ్లు, మాంసం కూడా ఉన్నాయి. బాగా ఉడికిన మాంసాహారం మాత్రమే తినండి. దీని ద్వారా మీకు ప్రోటీన్లు అందుతాయి. ఈ సమయంలో లివర్ తినకండి.

4. సముద్ర చేపలు

కొన్ని రకాల సముద్ర చేపలలో, మెర్క్యూరీ అధికంగా ఉంటుంది. దీని వలన కడుపులోని శిశువుకు చాలా ప్రమాదం, మీరు కూడా హైపర్ టెన్షన్ కు గురవుతారు. అందుకే ప్రెగ్నన్సీ మొదటి మూడు నెలలలో, మంచి నీటి చేపలను మాత్రమే తినండి.

5. జున్ను

కొన్నిసార్లు జున్ను అజీర్తికి కారణం అవుతుంది. అందుకే ఈ సమయంలో తినకపోవడం మంచిది. ఏ పాల ఉత్పత్తులైన తాజాగా  ఉండేవి మాత్రమే ఆహారంగా తీసుకోండి.   

Leave a Reply

%d bloggers like this: