baratadesamlo-pillala-meedha-jaripe-5-vichitramaina-mudacharalu

విభిన్నమైన మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు కలిగిన దేశంగా భారత దేశంతో, ఈ ప్రపంచంలో మరింకే దేశం పోటీకి రాలేదు. భారత దేశంలో, ప్రతి ప్రాంతంలో భిన్నమైన ఆచారాలు ఉన్నాయి. ఇవన్నీ కొంత వింతగా, కొంత భయం కలిగించేలా ఉంటాయి. ముఖ్యంగా పిల్లల మీద జరిగే కొన్ని విచిత్రమైన ఆచారాలు ఉన్నాయి. అలాంటివి ఏంటో చూడండి…

1. బిడ్డను కిందకు విసిరేయడం

మహారాష్ట్ర, కర్ణాటక లోని కొన్ని ప్రాంతాలలో, 2 ఏళ్ళ వయసులోపు పిల్లలను, 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు విసిరేస్తారు. ఇలా చేయడం పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ఇస్తుంది అని ఇక్కడ జనాలు నమ్ముతారు. కానీ చూసే వాళ్ళకు భయం కలుగుతుంది.

2. స్త్రీ సున్తీ

కేరళలోని కొన్ని మతాల వారు, 6-9 సంవత్సరాల ఆడపిల్లలకు సున్తీ చేయిస్తారు. అంటే స్త్రీ జననాంగాన్ని కత్తిరించడం. ఇది వారి ఆచారంగా భావిస్తారు. ఆడపిల్లలకు ఇది కొన్నిసార్లు చాలా ప్రాణాంతకంగా మారుతుంది.

3. వేడి పాలతో స్నానం

కొన్ని ప్రాంతాలలో ఆచారంలో భాగంగా పిల్లలకు వేడి పాలతో స్నానం చేయిస్తారు. పిల్లలు పుట్టిన తరువాత జరిగే పూజలో, తండ్రి బిడ్డకు వేడి పాలతో స్నానం చేయిస్తాడు.

4. ఇసుకలో పూడ్చిపెట్టడం

కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో పిల్లలను, ఇసుకలో మెడ వరకు పూడ్చిపెట్టడం ఆచారం. అంగవైకల్యంతో ఉన్న పిల్లలను గ్రహణం రోజు, ఇసుకలో మెడ వరకు పూడ్చిపెట్టి. ఆరుగంటల వరకు ఉంచుతారు. ఇలా చేయడం పిల్లల అంగవైకల్యానికి నయం చేస్తుందని వీరి నమ్మకం.

5. పేడలో దొల్లించడం

మధ్యప్రదేశ్ లో పిల్లలను పేడలో దొల్లిస్తారు, ఇది ఇక్కడి ఆచారం. అలా చేయడం వలన పిల్లలకు మంచి జరుగుతుంది అని భావిస్తారు. దీపావళి తరువాత రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. 

పిల్లలకు ప్రాణాంతకమైన ఇలాంటి ఆచారాలను కొనసాగించకుండా ఉండడానికి ప్రజలకు అవగాహన కలిగించాలి. 

Leave a Reply

%d bloggers like this: