bharyaa-barthala-madhya-tappkunda-jaragalsina

కొత్తగా దంపతులైన వారైనా, లేదా ఎన్నో ఏళ్ళ నుండి దంపతులుగా కలిసి ఉంటున్న వాళ్ళైనా, వారి మధ్య ఆ బంధాన్ని కొనసాగించడానికి కొన్ని విషయాలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని చాలా రహస్యంగా జరుగుతుంటాయి. నిజానికి చెప్పాలంటే అవన్నీ చాలా చిన్న చిలిపి విషయాలు. కానీ మీ అనుబంధం మీద చాలా ప్రభావం  చూపిస్తాయి. భార్య భర్తల మధ్య జరగాల్సిన అలాంటి విషయాలేంటో చూడండి…

1. వంట

ప్రతిసారి మీరు వంట చేయడం మాములే. కానీ ఏదైనా స్పెషల్ సందర్భంలో, మీ శ్రీవారు గరిట పట్టుకుని మీ కోసం ఏదైనా వంట వండితే…..మీరు ఫిదా అయిపోతారు కదూ. ఇలా అప్పుడప్పుడు జరగడం మీ అనుబంధాన్ని బలపరుస్తుంది.

2. పాట

మీ ఆయన గొప్ప సింగర్ కాకపోయిన, మిమ్మల్ని వడిలో పడుకోపెట్టుకుని, మీ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి , అలా నిమురుతూ, మీకోసం  ఒక పాట పాడితే… ఈ ప్రపంచాన్ని మైమర్చిపోతారు. ఇలా మీ అయన తప్పకుండా చేయాలి

3. పట్టుకోవడం

మీరిద్దరూ కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, మీరు తన సొంతం అని అందరికి చెప్పడానికి అన్నట్టు, మీ నడుము మీద చేయివేసో, మీ చేయి పట్టుకునో మిమ్మల్ని నడిపిస్తుంటే… తన చేతుల్లో ఒదిగిపోవాలనిపిస్తుంది.

4. కౌగిలింతలు

తనకు సంతోషమొచ్చినప్పుడు, లేదా నైట్ నిద్రపోయెటాప్పుడు మీ మధ్య అసలు దూరం ఉంచకుండా, మీమల్ని కౌగిలింతల్లో ముంచేయాలి.

5. పిల్లల్ని చూసుకోవడం

 మీరు బాగా అలసిపోయినప్పుడు, పిల్లల బాధ్యత తాను తీసుకుని, మీకు కాస్త విశ్రాంతి దొరికేలా చేస్తే, మీ ఆయన మీద ఇష్టం పెరిగిపోతుంది.

6. సర్’ప్రైజ్

మీరు ఆఫీస్ లో పూర్తిగా పనిలో మునిగిపోయినప్పుడు, మీ ఆయన మీకోసం పంపించే ఒక చిన్న “I LOVE YOU” అనే ఒక మెసేజ్, మీ పెదాల మీద సిగ్గుల నవ్వుల పువ్వులను పూయిస్తుంది కదూ..మీ ఆయన తప్పకుండా ఇలా చేయాలి.

7. అది తీస్తాడా

మీ ఆయన ఎప్పుడైనా, మీకు కష్టంగా ఉన్నప్పుడు, మీ బ్రా హుక్ ను తను తీస్తాడా…. ఇలా మీ ఆయన మీకోసం చేసే చిన్న చిలిపి సహాయాలు బావుంటాయి కదూ..

8. రెచ్చగొట్టండి

ఉదయం స్నానం చేసి, తడి జుట్టును అలా తుడుచుకుంటూ,  మీ ఆయన వైపు ఓర చూపులు చూస్తూ, కొంచెం ఆట పట్టించండి. ఇలాంటివి భార్య భర్తల మధ్య తప్పకుండా అప్ప్పుడప్పుడు జరగాలి.

9. బల్ల కింద

మీరు ఎప్పుడైనా, ఏదైనా రెస్టారంట్ కి వెళ్ళినప్పుడు, మీ ఆయన బల్లకింద నుండి మీ కాళ్ళను తాకుతూ  మిమ్మల్ని ఆట పట్టిస్తాడా….. మీ ఆయన ఇలా చేయడం మీకు ఇష్టమే కదూ

మీ ఆయన కూడా ఇలా రొమాంటిక్ అయిపోవాలంటే, ఇది మీ ఆయనకు తప్పకుండా SHARE చేయండి.

ఇది కూడా చదవండి..

మీలో మీ ఆయనకు నచ్చిన 6 విషయాలు…కానీ ఎప్పుడు చెప్పడు

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: