brest-feeding-samayamlo-assalu-tinakudani-5-aahar

కొన్ని ఆహారాలు తినడం మీకు మీ బిడ్డకు చాలా మంచిది. అలాగే కూని ఆహారాలు తినకూడనివి కూడా ఉన్నాయి. ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో మీరు ఈ క్రింది ఆహారాలు తింటే పిల్లలకు ఎలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు కావాల్సిన పోషకాలు అన్ని కూడా తల్లి పాల ద్వారానే లభిస్తాయి కనుక వారు తినే ఆహరం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అలంటి ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము.

1. టీ, కాఫీ మరియు డార్క్ చాక్లేట్

టీ, కాఫీ మరియు డార్క్ చాక్లేట్లలో కెఫిన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా మీకు వెంటనే కొంచెం విశ్రాంతి లభినట్టు ఉన్న రాత్రులు నిద్రరాకపోవడానికి ఇదే కారణం కూడా కావచ్చు. మీ అధిక శాతంలో కెఫిన్ తీసుకోవడం ద్వారా అది పిల్లలకు కూడా పాల నుండి చేరి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది కనుక వీటిని వీలైనంత వరకు తగ్గించండి.

2. మొక్కజొన్న

మొక్కజొన్న తినండం ద్వారా పిల్లల్లో తీవ్ర సున్నితత్వ ప్రతిస్పందనలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నన్ని రోజులు దీనిని సాధ్యమైనంత వరకు దూరంగా పెట్టడం మంచిది.

3. ఉల్లిపాయలు

ఉల్లిపాయలు ఎక్కువగా మీరు తింటే మీ పాలు తాగిన పిల్లలకు శూల నొప్పి వచ్చే అవకాశం ఉంది. అందువలన ఉల్లిపాయలను మితంగా తినండి.

4. పొదీనా ఆకు

పొదీనా ఆకు తినడం ద్వారా తల్లికి పాల శాతం తగ్గుతుంది. మీ పిల్లలకు కదుపు నింపడానికి సరిపడే అన్ని పాలు రావు. కావున, దీనికి కూడా దూరంగా ఉండండి.

5. బ్రోకలీ

బ్రోకలీ మీకు మంచిదే కానీ, దీని వలన పిల్లలకు గ్యాస్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. అందువలన కొన్ని రోజులు దీనిని కూడా తినకండి.

ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా Share చేయండి. 

Leave a Reply

%d bloggers like this: