మీ కుటుంబంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించడానికి సమయం వచ్చిందనుకుంటున్నారా? ఇప్పుడు మీ మనసులో మెదిలే ఒకే ఆలోచన ప్రేగ్నన్ట్ అవడం ఎలా? త్వరగా అవడం ఎలా? మీ దగ్గరి వాళ్ళని అడిగి, మీకు తెలిసింది చేసి, ప్రేగ్నన్ట్ అవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉండి ఉంటారు. అందుకే ఆ ప్రయత్నాన్ని సులువు చేయడానికి , త్వరగా ప్రేగ్నన్ట్ అవడానికి 7 చిట్కాలు…మీకోసం…
1. టైమింగ్
స్త్రీ శరీరం ఒక ఋతు క్రమాన్ని అనుసరిస్తుంది. ఆ ఋతు క్రమం ప్రకారం, ప్రతి నెల పిట్యూటరీ గ్లాండ్ నుండి విడుదలయ్యే హార్మోన్లు, అండ ఉత్పత్తికి కారణం అవుతాయి. దీనినే ఓవులేషన్ అంటారు. ఈ సమయంలో కలయిక జరిగితే, ప్రేగ్నన్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అయితే మీలో అండం విడుదలవుతుంది అని చెప్పడానికి, కొన్ని గుర్తులు ఉన్నాయి. మహిళల శరీరం నుండి జిగట లాంటి ద్రవం వస్తుంది, బాడీ టెంపరేచర్ పెరుగుతుంది.
2. వత్తిడి తగ్గించండి
అధిక వత్తిడి, మీ శరీర వ్యవస్తను, మీ ఋతుక్రమాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. లైంగిక అసమర్ధతకు కారణం అవుతుంది. మగవాళ్ళ నుండి వచ్చే కణాలను తగ్గిస్తుంది. అందుకే మీరు ప్రేగ్నన్ట్ అవ్వాలనుకునే ఈ సమయంలో మీరిద్దరు ఎంత వీలుంటే అంత, వత్తిడికి దూరంగా ఉండండి. మెడిటేషన్, యోగ లాంటివి ప్రయత్నించండి. వత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండడం, మీ ప్రెగ్నన్సీ అవకాశాలను పెంచుతుంది.
3. ఆరోగ్యకరమైన స్పెర్మ్
మీరు గర్భం దాల్చడానికి, మీ అందంతో పాటు, అండాన్ని ఫలదీకరణ చేసే మగవారి శరీరం నుండి వచ్చే కణాలు ఆరోగ్యంగా ఉండాలి. ఆ కణాలు ఆరోగ్యంగా ఉండడానికి, ఆల్కహాల్ మానేయండి, టొబాకో ఉత్పత్తులు లేదా ప్రోగ త్రాగడం పూర్తిగా మానేయండి. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోండి. సరైన బరువును మెయింటైన్ చేయండి.
4. శృంగారం
ప్రేగ్నన్ట్ అవ్వాలనుకుంటే మీరు తరచుగా శృంగారంలో పాల్గొనాలి. ఇది మీరు ప్రేగ్నన్ట్ అయ్యే అవకాశాలను పెంచుతుంది భర్తతో ఏకాంతంగా గడిపిన తరువాత, అలానే వెళ్ళకిలా పనుకోండి, ఆ కణాలు లోపలికి వెళ్ళి అండాన్ని చేరుకునే అవకాశం పెరుగుతుంది.
5. లూబ్రికేషన్ వాడద్దు
మీరు ప్రేగ్నన్ట్ అవడానికి సెక్స్ లో పాల్గొనే సమయంలో, లూబ్రికేషన్ కోసం ఎలాంటి లోషన్స్ కానీ, క్రీమ్స్ కానీ వాడద్దు. ఇలా చేయడం వలన ప్రేగ్నన్ట్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి.
6. వ్యాయామం
మీరు సరైన బరువును కలిగి ఉండడం, ప్రేగ్నన్ట్ అవడానికి చాలా అవసరం. అధిక బరువు ఉన్నా, లేదా తక్కువ బరువు ఉన్నా ప్రెగ్నన్సీ కష్టమవుతుంది. అందుకే సరైన బరువు మైంటైన్ చేయడానికి తేలిక పాటి వ్యాయామాలు చేయండి.
7. పోషకాహారం
పోషకాహారం తీసుకోవడం, మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి, ప్రెగ్నన్సీ కి సిద్దపరుస్తుంది. ఆకు కూరలు, తాజా కూరగాయలు, ప్రోటీన్స్ కోసం మాంసం, గుడ్లు తీసుకోండి. కెఫిన్ తో కూడిన పానీయాలను తీసుకోకండి.
శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు!!!!