తను-చనిపోతూ-బిడ్డల్ని-బ్రతికిస్తున్న-ఒక-అమ్మ-కథ-xyz

ఏ భాషలోనైనా త్యాగానికి అర్ధం “ అమ్మ“…తన బిడ్డలం కోసం ఎంత దూరమైన వెళ్తుంది, దేనినైనా వదులుకుంటుంది. బిడ్డల విషయానికి వస్తే అమ్మకు తన ప్రాణాలైనా తృణప్రాయమే. తన బిడ్డను రక్షించడానికి సునాయాసంగా తన ప్రాణాలను వదులుకుంటుంది, ఎంతటి త్యాగానికైనా సిద్దమవుతుంది. అలాంటి ఒక సంఘటన ఒకటి అమెరికాలో ఈ మధ్యనే జరిగింది…

ఎమీ జరిగింది?

మెలిస్సా చర్చిల్ అనే మహిళ, ప్రీ-ఏక్‘లంసియా ప్రేగనన్సీ కారణంగా, తన 22 వారాల ప్రెగ్నన్సీ సమయంలో హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. హాస్పిటల్లో నాలుగు వారాలు గడిచిన తరువాత, పరిస్థితి ఇంకా విషమంగా తయారయ్యింది. తనకు HELLP SYNDROME ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. తన కాలేయం చెడిపోయింది. ఆలస్యమైతే పిల్లల ప్రాణాలకే ప్రమాదం. తన ప్రాణాలకు ప్రమాదమైన, అత్యంత ఎమర్జెన్సీగా సి-సెక్షన్ చేయించుకుని, తన కవల పిల్లలల్ని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చింది. ఈ పిల్లల వయసు కేవలం 26 వారాల మూడు రోజులు. ఇప్పుడు ఈ ముగ్గురు, అమ్మ , ఇద్దరు కవలలు ప్రమాదకర పరిస్థితిలో, ICU లో చికిత్స పొందతున్నారు.

కానీ అమ్మ త్యాగం అంతటితో ముగిసిపోదుకదా, తను ఐసీయూలో, ఆక్సిజన్ తీసుకోడానికే కష్టంగా ఉన్న విషమ పరిస్థితిలో, తన కవలలకు కావాల్సిన పాలను, తన రెండు రొమ్ముల నుండి పిండి , డబ్బాల్లో అందిస్తుంది. తనకు ఎంత కష్టంగా ఉన్న, బాధ కలుగుతున్న, తన ప్రాణాలు పోతున్న అంతా ఓర్చుకుని, తన పిల్లల కోసం అలా చేయడం, అక్కడి వారందరిని కంట తడి పెట్టిస్తుంది.

అసలు విషయం అందరికి ఎలా తెలిసింది?

మెలిస్సా చర్చిల్ చెల్లలు అమెండ తిల్లబెర్గ్, తన అక్క పరిస్థితిని, ఫొటోలతో సహా, పేస్ బుక్ లో వివరించింది. ప్రపంచం మొత్తం ఆమె త్యాగానికి చలించిపోతుంది. వాళ్ళ ముగ్గురి ఆరోగ్యం కోసం ప్రార్ధనలతో ఆ ఫోటోను షేర్ చేస్తున్నారు.

మీరు కూడా, అమ్మ ప్రేమకు, త్యాగానికి నిర్వచనమైన ఈ సంఘటనను అందరికి తెలిసేలా SHARE చేయండి. 

Leave a Reply

%d bloggers like this: