belly-fat-taggalante-ee-6-sulabhamina-alavatlu-prayatninchandi

ఈ రోజుల్లో బెల్ల్య్ ఫ్యాట్ ఎక్కువ అయిపోతుందని బాధపడని వారు అంటూ ఉండరు. అతి పెద్ద సమస్యగా మారిన దీనికి పరిష్కారం  ఏమిటి? జిమ్కి వెళ్ళడం కష్టం, ఎటువంటి ఆహరం తినాలో తెలీదు? అలాంటప్పుడు ఈ సమస్యను తప్పించుకోవడానికి శుభాంగా  ఈ 6 అలవాట్లు చేసుకుంటే చాలు. అవేంటో తెలుసుకోండి. 

 ప్రోటీన్ రిచ్ అల్పాహారం తీసుకోవడం

 బ్రేక్ఫాస్ట్ కి సరైన ఆహారం ఏంటి అనే దానిపై రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఇప్పటివరకి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ప్రోటీన్ లు పుష్కలంగా ఉన్న అల్పాహారాలు బరువు నియంత్రించడంలో సహకరిస్తాయని నిర్దారించడం జరిగింది. ముఖ్యంగా, ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉన్న పదార్థాలు క్రావింగ్స్ ను నియంత్రించి, ఫుల్ గ ఉన్న భావనను కలిగిస్తాయి. దీనితో జంక్ పదార్థాలను చూసినప్పుడు మనల్ని మనం నియంత్రించుకోవడం సులువు అవుతుంది. ఇలగా బరువును అదుపులో పెంచుకోవచ్చు.

 మార్నింగ్ రొటీన్ ఆక్టివ్గా ఉండేలా చూసుకోవడం

 వీలైనంత వరకు ఉదయపు రొటీన్ ఆక్టివ్ గ ఉండేలా చూడండి. లిఫ్ట్ లు వాడడానికి బదులు మెట్లు ఎక్కండి. ఒకవేళ డ్రైవింగ్ చేస్తూ ఆఫీస్ కి వెళ్తే, కొంచం దూరంలోనే వెహికల్ ను ఆపి నడవాడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు పనిచేసే ప్రదేశం దగ్గరలో ఉంటె వెహికల్ లో కాకుండా, మ్యానువల్ గ వాడే సైకిల్ లాంటి వాటిలో ప్రయత్నించండి. ముఖ్యంగా, ఉదయాన్నే ఇలా ఆక్టివ్ గ ఉండే పనులు చేయడం ద్వార రోజంతా ఆక్టివేట్ గ ఉండడమే కాకుండా, ఎక్కువ కాలోరీస్ ఖర్చు చేయడం తో పాటు గ మెటబాలిజం కూడా మెరుగు పడుతుంది.

 ఉదయపు సూర్య కిరణాలను ఆస్వాదించడం

 ఉదయపు సూర్యుడి కిరణాలకు ఆరోగ్యపరమైన ప్రయోజానాలున్నాయని మనందరికీ తెలిసిందే. ఈ మధ్య జరిపిన ఓ సర్వే ప్రకారం, ఉదయన్నే సూర్య కిరణాలను అనుభవించడం ద్వార కూడా బరువు తగ్గోచ్చని నిరూపించడం జరిగింది. దాంట్లో ఉన్న సైంటిఫిక్ నిజాలను పక్కన పడితే, ఉదయన్నే బయటకేల్లడం తో తనువూ, మనసు ఉత్తేజ పడుతాయి. ఇది రోజంత ఆక్టివ్ గ ఉండడానికి దోహపడుతుంది. ఇంకో మాటలో ఎక్కువ కాలోరీస్ ఖర్చు చేయడం అన్నమాట, అంటే సన్నగా అవ్వడమే.

 యోగా

 ఈ యోగాలో ఉన్న అందమేమిట్టంటే యోగాసనాలు శరీరానికి ధృడత్వాన్ని,శక్తిని ఇస్తాయి. అందుకే పెద్దవారైన, చిన్నవారైన, ధృడంగాఉన్నవారైన,లేనివారైన ఆసనాలు వేయడానికి ఇష్టపడతారు. సాధచేస్తున్న కొద్ది ఆసనాల వెనకాల ఉన్న అంతరార్ధం బాగా అవగాహనకు వస్తుంది. ఆసనంలో ఉంటూనే బాహ్య కరమైన శారిరిక క్రమము నుంచి అంతరంగిక పరివక్రుత అనుభూతిలోకి వస్తుంది.

యోగ మన జీవితంలోని అంతర్భాగమే కానీ అన్య భాగము కాదు.  ఇది పుట్టినదగర నుంచి చేస్తున్న ప్రక్రియే. పసిపిల్లల్ని చుస్తున్నట్లిత వారు రోజు మోతంలో మకరాసనం, పవనముక్తసనం ఎన్నో సార్లు వేస్తూనే వుంటారు. యోగ అనేది యోగాసనాలను కూడా ఒక వ్యాయామంగానే చేయవచ్చు. సాధారణ వ్యక్తులేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు యోగా ఆచరించేందుకు ఇష్టపడతారు.

 

మీ శరీరాన్ని, మైండ్ మరియు ఆత్మను రిలాక్స్ చేయాలంటే ఇది ఒక మంచి సాధనం. బరువు తగ్గాలనుకుంటూ, మరింత ఆహ్లాదంగా భావించాలనుకునేవారు పవర్ యోగా కూడా చేయవచ్చు. పవర్ యోగా కు సాంప్రదాయ యోగా కు కొద్ది వ్యత్యాసం ఉంటుంది. దీనిలో మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. యోగాసనాలను కూడా ఒక వ్యాయామంగానే చేయవచ్చు. సాధారణ వ్యక్తులేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు యోగా ఆచరించేందుకు ఇష్టపడతారు. మీ శరీరాన్ని, మైండ్ మరియు ఆత్మను రిలాక్స్ చేయాలంటే ఇది ఒక మంచి సాధనం. బరువు తగ్గాలనుకుంటూ, మరింత ఆహ్లాదంగా భావించాలనుకునేవారు పవర్ యోగా కూడా చేయవచ్చు. పవర్ యోగా కు సాంప్రదాయ యోగా కు కొద్ది వ్యత్యాసం ఉంటుంది. దీనిలో మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. మీరు చేయవలసిందల్లా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ప్రయత్నాలు పెడితే చాలు చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మరి పవర్ యోగా ఆరోగ్య ప్రయోజనాలు ఎలా ఉంటాయో చుద్దాం.

 

శరీరం తేలికైపోతుంది – పవర్ యోగా లో మీ శరీరంలోని అన్ని భాగాలు కదలిక చేయబడతాయి. మీ శరీరం దీనిలో చేసే ఆసనాలు అంటే, సాగతీయటం, వంగటం వంటి వాటితో ఎంతో తేలికవుతుంది. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

శరీర జీవక్రియ పెరుగుతుంది – యోగా చేస్తే, శరీర మెటబాలిజం ఎంతో బాగుంటుంది. దీనికి కారణం పవర్ యోగా లో మన మైండ్ బాగా విశ్రాంతి పొంది మంచి ఆహ్లాదకరమైన భావనలు కలుగుతాయి. ఆ విధంగా మీరు శారీరకంగా, మానసికంగా ఎంతో చురుకుగా ఉంటారు.

బ్లడ్ సర్కులేషన్ – పవర్ యోగా లో మీకు బ్లడ్ సర్కులేషన్ బాగా పెరుగుతుంది. శరీర రక్తప్రసరణ పెరిగి వ్యాధులు దరికి చేరవు.

రోగ నిరోధకత పెరుగుతుంది – పవర్ యోగా రెగ్యులర్ గా సాధన చేస్తే, మీ శరీర రోగ నిరోధక వ్యవస్ధ మెరుగవుతుంది. అధిక ఆక్సిజన్ మీ శరీరంలోకి ప్రవేసిస్తుంది. ఇది మీ శరీరం తన జీర్ణ క్రియను మెరుగుపరచుకోటానికి, మలినాలను బయటకు వదిలేయటానికి పనికి వస్తుంది. దానితో జీర్ణక్రియ పెరిగి, మీ చర్మంలో మెరుపు కూడా ఏర్పడుతుంది.

 కార్డియో వ్యాయామాలు

గుండె జబ్బులు రావడానికి కొలెస్ట్రాల్ పెరిగిపోవడం ప్రధాన కారణం. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదమున్న ఈ సమస్యను చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దూరం చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ ముప్పును తప్పించుకోవాలంటే క్రమంతప్పకుండా కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉంది, కొలెస్ట్రాల్ వల్ల ముప్పు ఏర్పడే అవకాశం ఉందా అనే విషయాలు తెలుస్తాయి. పై అంతస్తుకు వెళ్లాలనుకుంటే లిఫ్ట్‌ను ఉపయోగించకండి. మెట్లను ఉపయోగించండి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడానికి ఇది మంచి మార్గం. శారీరక వ్యాయామం కోసం నడక చాలా మంచిది. ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చుప్రతిరోజు తీసుకునే ఆహారంలో 5 నుంచి 10 గ్రాముల ఫైబర్(పీచు పదార్థాలు) ఉండేలా చూసుకోవాలి. ఉదయపు అల్పాహారంలో ఓట్‌మీల్ తీసుకోవడం, కూరగాయలు ఎక్కువగా తినడం చేయాలి.

* సాయంత్రం సమయంలో ఆకలిగా ఉన్నట్లయితే నట్స్ తీసుకోండి. మిర్చి బజ్జీకి బదులుగా నట్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. కడుపు కూడా నిండుతుంది.

* బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉంటే కొలెస్ట్రాల్ స్థాయి నార్మల్‌గా ఉంటుంది. అధిక బరువుతో బాధపడే వారిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది.

నడవడం

సాధారణంగా నడక అనేది ఒక వ్యాయామం వంటిదే. నడక ఆడవారికైనా మగవారికైన మంచి మేలు చేస్తుంది. అందుకే చాలా మంది ఉదయాన్నే వ్యాయామంగా ఉంటుందని నడుస్తుంటారు. ముఖ్యంగా గుండెవ్యాధులు, మధుమేహరోగులు నడవడం చాలా మంచిదని వైద్యులు సలహా ఇస్తుంటారు. కేవలం ఇటువంటి వారే కాదు వయసులో ఉన్న ఆడ, మగవారు కూడా నిత్యం నడుస్తుండం చాల మంచిది. చక్కటి ఆరోగ్యానికి నడక ఒక పునాది లాంటిది. అందుకే మనం సాధారణంగా గమనించినట్లయితే పల్లెటూళ్లలో చాలా మందికి నడక బాగా అలవాటు ఉంటుంది. పట్నవాసులు మాత్రం తక్కువ దూరానికి కూడా వాహనాలలో ప్రయాణించి నడకకు దూరమైపోతున్నారు. గ్రామాల్లో ఉన్నవారికి నడవడం అలవాటుంది. కనుకే వారు అన్ని విధాల అరోగ్యంగా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే పల్లెటూళ్లలో ఉండే వారికంటే పట్నం వాసంలో ఉన్నవారికి అందుకే జబ్బుల బెడద చాలా ఉంది.

ఆరోగ్యంగా ఉండాలంటే మార్నింగ్ వాక్ ఎంతో ఉపయోగకరమైంది, సులభతరమైనదీను.  ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని నడక ప్రారంభించడం ఎంతో ఉత్తమం. ఎందుకంటే ఉదయంపూట స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది. సూర్యోదయపు నులివెచ్చటి కిరణాలు శరీరానికి తగులుతుంటే ఆహ్లాదంగా ఉంటుంది

Leave a Reply

%d bloggers like this: