mahila-drudamaina-balamaina-yemukula-kosam-6-aharalu

ఎముకలు బలంగా, దృడంగా, ఆరోగ్యంగా ఉండడానికి, శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు రెండు; క్యాలిసియం, విటమిన్ ‘D’ . మీ ఎముకుల, మరియు పళ్ళు దృడంగా ఉండడానికి క్యాలిసియం తోడ్పడుతుంది. మీ శరీరం క్యాలిసియం తీసుకోవడానికి, ఎముకుల ఎదుగుదలకు విటమిన్ ‘D’ ఉపయోగపడుతుంది. 50 ఏళ్ళ లోపు మహిళలు, 1000 మిల్లీ గ్రాముల క్యాలిసియంను, 200 ఇంటర్నేషనల్ యూనిట్స్ (IUs) విటమిన్ ‘D’ రోజు తీసుకోవాలి.

ఎముకుల దృఢత్వం కోసం, మీరు తీసుకోవాల్సిన, క్యాలిసియం, విటమిన్ ‘D’ అధికంగా ఉండే ఆహారాలు ఇవే…

1. పెరుగు

పెరుగులో విటమిన్ ‘D’ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు పెరుగులో 30% క్యాలిసియం, 20% విటమిన్ ‘D’ ఉంటాయి.  మీరు రోజు ఒక కప్పు పెరుగు తీసుకోవడం వలన, మీ ఎముకలు బలంగా అవడానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

2. పాలు

పాలు కాల్షియమ్ కు ప్రతి రూపం. ఒక గ్లాసు పాలు మీరు రోజు తీసుకుపోవడం చాలా మంచిది. మీ శరీరానికి కావాల్సిన 30% కాల్షియమ్ అందుతుంది.

3. జున్ను (Cheese)

మీ శరీరానికి కావాల్సిన కాల్షియమ్, మీరు జున్ను తినడం వలన కూడా లభిస్తుంది. జున్నులో కాల్షియమ్ అధికంగా ఉంటుంది. అందుకే వీలున్నప్పుడు జున్నును మీ ఆహారంలో భాగం చేసుకోండి.

4. చేపలు

ఎముకుల శక్తి కోసం, చేపలు తినడం చాలా మంచిది. ముఖ్యంగా ఎండు చేపలు. వీటిలో విటమిన్ ‘D’ పుష్కలంగా ఉంటుంది. సాల్మన్ (Salmon), ట్యూనా (Tuna) చేపలు కూడా తినడానికి ప్రయత్నించండి.

5. గుడ్లు

మీ శరీరానికి కావాల్సిన కాల్షియమ్ అందడానికి గుడ్లు ఒక చక్కని ఆహారం. రోజు ఒక గుడ్డు తీసుకోవడం వలన మీ శరీరానికి 6% కాల్షియమ్ అందుతుంది.

6. పాలకూర

 

 

 

పాలకూర తినడం, శరీరానికి కాల్షియమ్ అందడానికి ఇంకో మార్గం.  పాల కూరలో 25% కాల్షియమ్ ఉంటుంది. కాల్షియమ్ తో పాటు ఐరన్, ఫైబర్, విటమిన్ ‘A’ కూడా, పాలకూర ద్వారా శరీరానికి అందుతాయి.

Leave a Reply

%d bloggers like this: