brahmamudi-latuga-kattirinchadam-valana-kalige-prayojanalu-vinte-kathrinchakudadha

బ్రహ్మ ముడిని సాధారణంగా బిడ్డ పుట్టిని 20 సెకండ్స్ లోపే కట్ చేసెస్తారు. కానీ ఇటీవల జరిగిన ఒక పరిశోధన ప్రకారము బ్రహ్మ ముడి 1-3 నిమిషాల తరువాత కట్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసింది. కేవలం మూడు నిముషాలు లేటుగా బ్రహ్మ ముడి కట్ చేయడం వలన ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయా అని ఆశ్చర్యం వ్యర్థం చేసారు ఈ పరిశోధన హెడ్ Dr. Ola Andersson. ఇలా లేటుగా కట్ చేయడం వలన ఉపయోగాలు 4 సంవత్సరాల నుండి తెలియడం మొదలవుతుంది. ఇప్పుడు లేటుగా బ్రహ్మముడి కట్ చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

1. నరాల ఉపయోగాలు

తల్లి కడుపులో నుండి బిడ్డని బయట తీసిన తరువాత ఇంకా పూర్తిగా బ్రహ్మముడిలో నుండి పిల్లల్లోకి రక్తం వచుండడు. కాస్త టైం ఇస్తే చాలు తల్లి నుండి పూర్తిగా రావాల్సినవన్నీ బిడ్డకు వచ్చేస్తాయి. ఆలా జరగడం వలన మొదటి ఉపయోగం నాడీ వ్యవస్థ బాగా పనిచెయ్యడం. పరిశోధన ప్రకారము, బ్రహ్మ ముడి లేటుగా కట్ చేసిన పిల్లలు అత్యంత చురుకుగా అందిరితో కలిసి ఉంటారంట.

2. అనీమియా వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

మెదడు ఎదుగుదలకు ఎక్కువ అవసరం. ఈ 3 నిముషాలు లేటుగా బ్రహ్మ ముడి కట్ చేయడం వలన శరీరానికి కావాల్సిన ఐరన్ లభిస్తుందట, ఆ చివరగా ప్రవహించే రక్తంలో. దీని వలన అనీమియా వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధకులు చెప్తున్నారు.

3. ఎక్కువ రక్త శాతం

రక్త శాతం కూడా కావాల్సిన మోతాదులో పెరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఒక సర్వే ప్రకారం, ఇలా ఆలస్యం చేయడం ద్వారా గాయాలు తొందరగా మానుతాయంట.

4. స్టెమ్ సెల్స్ పెరుగుతాయి

ఈ రోజుల్లో స్టెమ్ సెల్స్ ఉపయోగాలు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. కాబట్టి, కేవలం మూడు నిముషాలు లేటుగా చేయడం ద్వారా భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరమైన స్టెమ్ సెల్స్ కూడా పెరుగుతాయంట.

5. నెలల తక్కువ బిడ్డలకు

నెలలు తక్కువగా పుట్టే బిడ్డలకు ఇది చాలా ఉపయోగం అంట. వీఈరికి ఎలా చేయడం ద్వారా రక్తపోటు సరిగ్గా ఉంది ఎక్కువ మందులు వాడాల్సిన అవసరం రాదంట. 

Leave a Reply

%d bloggers like this: