పిల్లల చేసే ప్రతి పని చాలా ముచ్చటగా ఉంటుంది. ప్రతి అడుగు, ప్రతి కదలిక మీ కుటుంబంలో ఆనందాన్ని పంచుతాయి. వాళ్ళు మొదటి సారి, ఆవులింత, మొదటి నవ్వు, మొదటి అడుగు ఏదైనా, అన్ని అద్భుతాలే. చూడడానికి వేయి కళ్ళు కావాలనిపిస్తుంది. కానీ మీకు ఎన్ని కళ్ళు ఉన్న, కడుపులో మీ బిడ్డలు చేసే పనులు మీరు చూడలేరు కదా. అవును పిల్లలు కడుపులో కూడా అల్లరి చేస్తారు. ఆవులిస్తారు, ఏడుస్తారు, నవ్వుతారు, తంతారు,… ఈ అల్లరంతా అల్ట్రా సౌండ్ సహాయంతో తీసిన ఈ వీడియోలో చూపిస్తున్నాం… చూడండి… తప్పకుండా మనసు పులకిస్తుంది..
వీడియోలో ఏ టైమింగ్స్ లో ఎలాంటి అల్లరి చేస్తున్నారో ఇక్కడ చూడండి..
కవలలు – 0:26-0:48
ఇద్దరు కవలలు, అమ్మ కడుపును ఎలా పంచుకుంటున్నారో చూడచ్చు
12 వారాల శిశువు – 1:22
ఇక్కడ 12 వారాల వయసులో శిశువు ఎలా ఉంటాడో కనపడుతుంది.
పూర్తిగా ఎదిగిన శిశువు – 1:43
పూర్తి ఎదిగిన శిశువును ఇక్కడ చూడచ్చు… ఇక్కడనుంచి అల్లరి మొదలవుతుంది.
ఆడ మగ – 1:53
బిడ్డ అమ్మయా లేదా అబ్బాయా.. తెలుస్తుంది. ఈ వీడియోలో అల్లరి చేయబోయేది బాబే..
ఫుట్ బాల్ – 2:16
అమ్మ కడుపులో ఫుట్ బాల్ ఎలా ఆడేస్తున్నాడో ఇక్కడ చూడండి.. ఒక్క గోల్ కూడా మిస్స్ అవ్వదు.
టెన్నిస్ – 2:29
ఇక్కడ టెన్నిస్ ఆడుతున్నట్టు పోసు చూడండి.
స్కేటింగ్ – 2:36
ఇక్కడ కాస్త సరదాగా, స్కేటింగ్ పోసు పెట్టాడు.
ముక్కు – 3:24
కడుపులో వాసన నచ్చినట్టు లేదు, వేళ్ళతో ముక్కులు మూసుకుంటున్నాడు.
అనుకరణ – 3:37
అసలైన విషయం ఇక్కడ ఉంది. బయట నుండి వినపడే మీ మాటలను, అనుకరించడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఏడుపు – 3:46
ఆకలి వేసిందేమో, ఏడుపు మొదలు పెట్టాడు.
గోక్కోవడం – 4:54
పాపం, అసలు ఏమి జరుగుతుందో ఏమి అర్ధమైనట్టు లేదు, తల గోక్కుంటున్నట్టు ఉన్నాడు.
బాక్సింగ్ – 5: 42
కవలలు ఇద్దరు, బాక్సింగ్ ఆడేస్తున్నారు.
ఆవులింతలు – 5:55
బోర్ కొట్టినట్టు ఉంది, ఒకటే ఆవులింతలు.
నవ్వు – 7:13
మీరు బయట నుండి చెప్పిన జోక్ ఏదో అర్ధమైనట్టుఉంది, ముసిముసి నవ్వులు, ఎ లా నవుతున్నాడో చూడండి.
నిజంగా కడుపులో ఇన్ని విషయాలు జరగడం ఒక అద్భుతం కదూ…. ఈ అద్భుతాన్ని తప్పకుండా అందరికి SHARE చేయండి.
ఇవి కూడా చదవండి
శిశువు గర్భంలోనే ఎన్ని విషయాలు నేర్చుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
………………………………………………………………………………………..
మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..
Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.
ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.
Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి