tama-barthalu-chesina-madhuramaina-vishayala-gurinchi-maatho-panchukunna-mugguru

మీ భర్త చేసే కొన్ని చిన్న చిన్న పనులు, మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. మీ ఆయన మీద ప్రేమను అమాంతం పెంచేస్తాయి. ఇంత చిన్న విషయాలకు అంత శక్తి ఎలా? ఎందుకంటే అవి మధురమైనవి కనుక. ఈ మధురమైన పనులు, మీ ప్రేమ జీవితాన్ని మళ్ళి మొదలవడానికి కారణం అవుతాయి. అలా తమ భర్తలు చేసిన మధురమైన పనుల గురించి, మాతో కొంతమంది మహిళలు పంచుకున్నారు… ఇవే అవి..

1. నాకు బాలేనప్పుడు..

“.. మాములుగా ఇంట్లో అన్ని పనులు నేనే సునాయాసంగా చేసి పడేస్తాను. మా ఆయన సహాయం ఎందుకో తీసుకోవాలనిపించదు.  కానీ మా ఆయన తాను చేయదగిన పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. కానీ ఒక రోజు నాకు బాగాలేకుండా వచ్చింది. ఆరోజు ఉదయంకూడా లేవలేకపోయాను. ఇంట్లో పనులన్నీ అలానే ఉండిపోయాయి. మా ఆయన ఆఫీస్ కి వెళ్ళిపోయాక, అలానే పడుకుండిపోయాను. ఆరోజు సాయంకాలం, ఎందుకో మా ఆయన ఆఫీస్ నుంచి చాలా నీరసంగా వచ్చారు. ఇంట్లో పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. సాయంకాలానికి కొంత కుదుటపడడంతో, మా కనీసం టీ అయినా పెడుతామని. లేచి రెడీ అవడానికి బాత్రూమ్లోకి వెళ్ళాను.

నేను బయటకు వచ్చి చూస్తే.. టేబుల్ మీద వేడి టీ వుంది, సోఫాలు అన్ని సర్దివున్నాయి, ఇళ్ళు అంత నీట్గా సర్ది ఉంది.. ఆశ్చర్యంతో మా ఆయన కోసం చూస్తూ.. వంట గది లోకి వెళ్లి చూస్తే… మా అయన అంట్లన్నీ ముందేసుకుని, తోముతు….’నువ్వు రోజు ఇంత పని చేస్తున్నావా? ఇక నుంచి నన్ను కూడా ఈ పనులన్నీ చేయనీవు’… అని అనగానే నాకు ఎందుకో కన్నీళ్లు వచ్చేసాయి. మా ఆయన నాకోసం చేసిన ఆ పనీ ఎప్పటికి మర్చిపోలేను… “

                                                                                                                                                                                              – ప్రణీత

2. నా బంగారం..

“ ఒకసారి నేను మా ఆయన, తన అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి వెళ్ళాం. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. మా ఆయన అందరిని పలకరిస్తున్నారు. నేను కూడా అందరితో కలిసిపోయి మాట్లాడుతున్నాను. కానీ మా ఆయనకి అత్త వరస అయ్యే ఒక ఆవిడ, ఎందుకో నా మీద ప్రతి దానికి చిరాకు పడుతుంది. నన్ను గుచ్చి గుచ్చి చూస్తుంది. నేను ఏమి అనకపోయినా ఏదో ఒక సూటిపోటి మాటలు అంటుంది. ఉన్నటుండి అందరి ముందు… ‘ మా వాడికి ఏమి తక్కువని, ఈ పిల్లను పెళ్లిచేసుకున్నాడు. వాడికి కావాలనుకుంటే ఇంకా మంచి అమ్మాయని ఇచ్చి పెళ్ళి చేసేవాళ్ళం.. అంతదాకా ఎందుకు బంగారం లాంటి నా కూతరు లేదు.. ‘. ఇలా అనగానే, నాకు చాలా అవమానంగా అనిపించి, ఏడుపొచ్చేసింది. ఏమి చేయాలో అర్ధం కాలేదు. ఇంతలో ఎక్కడనుంచి వచ్చాడో తెలీదు.. ‘ నాకు నా భార్య దొరకడం అదృష్టం….ఎన్ని బంగారాలైన తక్కువే’ అంటూ, నా చేయి పట్టుకుని నన్ను అక్కడినుండి తీసుకొచ్చేసాడు..

తర్వాత కార్లో ఇంటికి వెళ్ళేటప్పుడు…. అక్కడ జరిగిన దానికి తను సారీ చెప్పాడు. నేను ఏమి మాట్లాడకుండా… తనను కౌగలించుకుని.. ‘ నువ్వే నా బంగారం…’ అని ఏడ్చేసాను.

                                                                                                                                                                                                 -సౌందర్య

3. నాకు, బాబుకు తనే అమ్మ అయ్యాడు

“ మా బాబు పుట్టిన మొదటి మూడు సంవత్సరాల తరువాత, నాకు థైరాయిడ్ ఆపరేషన్ జరిగింది. ఒక నెల పూర్తిగా బెడ్ మీదే ఉన్నాను. ఏ పని చేయలేకపోయేదాన్ని. అప్పుడు మా వారు అన్ని బాధ్యతలను తానే తీసుకున్నాడు. ఇంట్లో సహానికి మా అమ్మ వచ్చిన, తనను ఏ పని చేయనిచ్చే వాడు. మా బాబుకు స్నానం నుండి తినిపించడం వరకు అన్ని తనే చేసేవాడు. నన్ను కూడా చిన్న పిల్లలాగా,  అన్ని తనై చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ కొన్ని రోజులను నేను ఎప్పటికి మర్చిపోలేను. 

                                                                                                                                                                                                    -మేఘన 

ఇలాంటివి మీ ఆయన ఎప్పుడైనా చేసారా?  ఇవన్నీ మీ ఆయనకు తెలిసేలా తప్పకుండా  SHARE చేయండి. 

Leave a Reply

%d bloggers like this: