vinayaka-chavitinadu-ee-sulabhamina-mantram-japiste-pillalaku-chaduvu-baaga-vastundi

మనం అనుకుంటాం కదా మంత్రాలూ తంత్రాలు ఎందుకు పనికొస్తాయని, కానీ వాటిని ఊరికే మన పూర్వికులు కనిపెట్టలేదు. వాటి వెనకాల ఒక అర్థం పరమార్థం ఉంటుంది. కొన్ని విషయాలు మన చూస్తే కానీ నమ్మలేము మరి కొన్ని విషయాలు మనం నమ్మితే కానీ చూడలేము. అలాంటిదే మన హిందూ మతంలో ఉచ్ఛరించే మంత్రాలది. ఓం అనే మత్రం చదివితే అన్ని చక్రాలు ఉత్తేజం చెందుతాయి అందుకే వీటిని మనం ఉచ్ఛరిస్తాము. సరిగ్గా గమనిస్తే ఓం, ఆమెన్ మరియు అల్లా అన్నపుడు శబ్ద తరంగాలు వాటికి ఉచ్చరించడానికి మనం ఉపయోగించే శక్తి ఒకలా ఉండడం మనం గమనించవచ్చు.

అలానే ప్రతి మంత్రానికి ఒక విలువ ఉంటుంది. ఎక్కడో గుచ్చితే వేరెక్కడో నొప్పి నయం చేసే విద్య ఆక్యుపంక్చర్ ని చైనీయులు కనిపెట్టారు. అలాగే శబ్ద తరంగాలతో మన భారత దేశంలో ఎంతో మంచి జరుగుతుంది అని కనిపెట్టారు. ఒక్కో మంత్రం ఒక్కో రకమైన శబ్దతరంగాలను సృష్టిస్తుంది. వాటితో ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి.

ఏమోలే, ఈ టాపిక్ ని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు కాబట్టి సులువుగా వాళ్ళు చెప్పింది పాటిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు పిల్లల మేధస్సును పెంపొందించే మంత్రం ఏమిటో తెలుసుకుందాము.

జ్ఞానానందమయం దేవం

నిర్మల స్పటికాకృతిం  

ఆధారం సర్వ విజ్ఞానం

హయగ్రీవ ముపాస్మహే

ఈ మంత్రం చిన్నపుడు మా అమ్మ నాకు రోజు చెప్పించేది. మీరు మీ పిల్లలకు చెప్పించండి, వారిని మంచి మార్గంలో నడిపించండి. ఈ మంత్రం రోజు ప్రశాంతమైన మనస్సుతో దేవుడిని ముందు నిలుచొని 5 సార్లు జపిస్తే మంచి ఫలితం ఉంటుంది. జ్ఞానాన్ని ఎంత పంచితే అంత పెరుగుతుందట కాబట్టి మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అన్నట్టు మర్చిపోయా… వినాయక చవితి శుభాకాంక్షలు…

Leave a Reply

%d bloggers like this: