శృంగారం ఎప్పటికీ ఒకేలా ఉండదు. మరీ ముఖ్యంగా మీరు తల్లి అయిన తర్వాత మీ శరీరంలో వచ్చే మార్పుల వల్ల మీ శృంగార జీవితం చాలా మారుతుంది. అయితే చాలా మంది భర్తలు భార్యలలో వచ్చే మార్పును బాగా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి దీని గురించి ఆందోలన చెందాల్సిన అవసరం లేదు. అయితే పోస్ట్ ప్రెగ్నెన్సీ రతి క్రీడ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటంటే,
1. హార్మోన్స్
ప్రసవం తర్వాత మహిళలలో హార్మోన్స్ మార్పు ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందులో భాగంగా పెల్విక్ రిమ్ కొంచెం లూజ్ అవుతుంది. ఈ పెల్విక్ రిమ్ లూజ్ అవ్వడం వల్ల మీ శృంగారం మునుపటిలా జరగకపోవచ్చు. సహజ కాన్పు జరిగిన వారిలో ఇది కొంచెం ఎక్కువ లూజ్ అయ్యే అవకాశం ఉంది.
2. నొప్పి
ప్రసవం తర్వాత రతిలో పాల్గొనేటప్పుడు మహిళలు ఎక్కువ నొప్పిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీకు మరీ నొప్పిగా ఉంటే వైద్యున్ని సంప్రదించడం చాలా మంచిది.
3.వత్తిడి
ప్రసవం తర్వాత చాలా మంది మహిళల్లో ఒక ఆలోచన ఉంటుంది. అదేంటంటే, నేను భర్తకు దగ్గర కావాలా లేక బేబికి దగ్గరగా ఉండాలా అని? దీంతో ఒత్తిడి కూడా రావచ్చు. దీనికి పరిష్కారంగా మీరు ఇద్దరికీ దగ్గరగా ఉండండి. అవసరం అయినప్పుడు భర్తకు సర్ది చెప్పండి.
4. పిల్స్
గర్భ నిరోధక మాత్రలు వాడండి. ఎందుకంటే, మీరు పాలిస్తున్నా కూడా ఒక్కోసారి గర్భం వచ్చే అవకాశం ఉంది. కాబట్టీ ముందుగా జాగ్రత్త పడటం మంచిది.
5. ఓపిక
మీకు చాలా పనులు ఉండటం వల్ల శృంగారం అన్నది అన్నింటి తర్వాత గుర్తు రావచ్చు. అయితే ఇలాంటి సమయాలలో భర్తకు దగ్గరగా ఉండటం వల్ల శృంగార జీవితాన్ని హాయిగా ఆనందించవచ్చు. అయితే, ఇద్దరికీ ఓపిక ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
6. పాలు వస్తాయి
మీరు శృంగారం చేసేటప్పుడు ఒక్కోసారి మిల్క్ రావచ్చు. దీని గురించి మీరు ఖంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కువ మిల్క్ ఉత్పత్తి అయినప్పుడు ఇది సాధారణం. మీభర్త ఈ విషయంలో మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు.
7. ఎక్కువ ఆహ్లాదం
ప్రసవం తర్వాత మీరు అనుభవించే రతిక్రీడ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మీ జననేంద్రియాల గురించి మీరు మరింత ఎక్కువ తెలియడం వల్ల శృంగారంలో ఉండే ఆనందాన్ని మీరు మరింత ఎక్కువ పొందుతారు. అయితే మొదటిసారి చేసేటప్పుడు చాలా నిదానంగా చేయాలి.
8. నిద్ర
మీకు ఎక్కువ పనులు ఉండటం వల్ల శృంగారం చేసుకోకుండానే నిద్రపోయే అవకాశం ఉంది కాబట్టీ మీరు మధ్యాహ్న సమయాలలో రతిక్రీడ గురించి ఆలోచించడం వల్ల రాత్రికి శృంగారంలో పాల్గోని ఆనందాన్ని పొందవచ్చు.
9. పొడిబారిపోతుంది
ప్రసవం తర్వాత మీ వెజినా డ్రై అయ్యే అవకాశం ఉంది దీంతో మీకు అక్కడ తేమ ఉండకపోవచ్చు తద్వారా మీకు నొప్పిగా అనిపించవచ్చు. కాబట్టి తేమను విడుదల చేసే లూబ్రికెంట్స్ వాడటం వల్ల మీరు శృంగారాన్ని మరింత ఎక్కువ అస్వాదిస్తారు.
10. సిజేరియన్
మీరు సిజేరియన్ చేసుకున్నా కూడా శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒక్కోసారి నొప్పి కలిగే అవకాశం ఉంది. దీనికి కారణం హార్మోన్స్ లోపమే. కాబట్టి, శృంగారం చేసేటప్పుడు సున్నితంగా చేయడం మంచిది. మీకు నొప్పి తగ్గకపోతే డాక్టర్ను కలవడం మంచిది.