meeru-rendo-biddanu-kanadaniki-siddapaduthunara-ee-vishayalu-tappaka-telusukondi

మీ కళ్ళ ముందు సరదాగా ఆడుకుంటున్న పిల్లాడిని చూసి ఇంకో బిడ్డని కంటే బాగుండు అనుకుంటుండగా మీ భర్త కూడా నవ్వుతు వచ్చి తాను కూడా అదే అనుకుంటున్నాను అని మీకు చెప్పారా. ఈ ఆలోచన ఎంత బాగుంది కదా. కానీ మొదటి పిల్లవాడిని  కన్న దాని కంటే రెండో పిల్లాడిని కనడంచాలా కష్టం.  కానీ కన్న తరువాత మీకు మీ పిల్లాడికి చాలా ఆనందంగా ఉంటుంది. రెండు బిడ్డను కనాలి అనుకుంటే ఈ విషయాలు తప్పకుండా ఆలోచించండి, పరిగణలోకి తీసుకోండి.

1. మీ కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించండి

కొత్తగ ఇంట్లోకి అడుగుపెట్టిన మొదటి బిడ్డ వలన కలిగిన మార్పుకి చాలా మంది తల్లిదండ్రులు వెంటనే అలవాటు పడలేరు. వారికి ఒక బిడ్డను చూసుకోవదాంతోనే సమయం సరిపోతుంది. మీరు ఈ కోవకు చెందిన వారు అయితే కొంచెం లేటుగా రెండవ బిడ్డను కనడం మంచిది. అంతే కాకుండా అంటారు పిల్లలు ఒకేలా ఉండరు. మీ మొదటి బిడ్డ సైలెంట్గా ఉంటె పుట్టబోయే రెండో బిడ్డ అల్లరిగా ఉండవచ్చు. మీరు ఎంత వరకు వారిని చూసుకోగలరో కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోండి. మీ మొదటి బిడ్డ అల్లరిగా ఉంటె తన మీదనే ఎక్కువ శ్రద్ద వహించాలి కాబట్టి రెండవ బిడ్డను కొంచెం ఆలస్యం చేయడం మంచిది.

2. తల్లి వయస్సును దృష్టిలో పెట్టుకోండి

పిల్లలను కన్నడంలో తల్లి వయస్సును కూడా పరిగణలోకి తీసుకోవడం అత్యత అవసరం. పిల్లలు కనడానికి సరైన వయసు 25 నుండి 35 సంవత్సరాలు. ఒక వేల మీకు 35 సంవత్సరాలు దాటి ఉంటె ఇంకో బిడ్డను కణాలనుకునే ముందు డాక్టర్ని ఒకసారి సంప్రదించండి. అంతే కాకుండా మీ పూర్ణ ఆరోగ్య స్థితిని అంచచన వేసుకోండి, ప్రసవ వేదనను తట్టుకోగలరో లేదో అని.

3. మీ ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకోండి

మరో పిల్లాడిని కనడానికి సిద్దపడే ముందు అన్నింటికంటే ముందుగా పరిగణలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఆర్ధిక పరిస్థితి. అసలే మొదటి బిడ్డ పుట్టాడడం వలన ఎంతో ఖర్చు పెరిగుంటుంది. అంతే కాకుండా ఒక సారి తాను స్కూల్ కి వెళ్లే వయసు వస్తే ఖర్చులు మరింత పెరుగుతాయి. ఈ రోజుల్లో పిల్లలకు మంచి విద్యను అందివళ్లంటే వేలకు వేలు కట్టి మంచి స్కూల్లో చేర్చాలి. ఇలా ఇన్ని భాద్యల నడుమ ఇంకో బిడ్డ కనడం వలన మీకు ఆర్ధికంగా ఏమైనా సమస్య వస్తుందా అని ఒకసారి ఆలోచించుకోండి. మీకు బాగా డబ్బులు ఉండి, ఇంకో బిడ్డను కనడం వలన ఎటువంటి ఇబ్బంది రాదు అనుకుంటే ఈ విషయం ఆలోచించాల్సిన పని లేదు.

4. భార్య భర్తలు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోండి

భార్య భర్తల్లో ఎవరో ఒకటే మరో బిడ్డ కోరుకోవడం  సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ, ఇలాంటి ఒక పెద్ద నిర్ణయాన్ని ఇద్దరి సమ్మతం లేకుండా తీసుకోవడం మీ బంధానికి అంత మంచిది కాదు. అందువలన ఎవరికి నచ్చక పోయినా ఇంకొకరు సర్ది చెప్పడానికి ప్రయత్నించండి, లేదంటే మీ ఆలోచనను మార్చుకోవడం మంచి. ఈ విషయం గురించి ఇద్దరు కాస్త నష్టాలు, పెరిగే భాద్యతలు ఇలా ప్రతి దాని గురించి చర్చించుకొని ఒక మంచి నిర్ణయానికి రండి.

Leave a Reply

%d bloggers like this: