pasi-pillalaku-tepu-rappinchadam-ela-dani-valana-upayogam-emiti

పిల్లలకు మొదటి సారి ఆహారం తినిపించడం ఎంతో ఆనందాన్ని కలిగించే ప్రక్రియ. వారికి తిన్న తరువాత తేపు రప్పించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని చాల మందికి తెలియదు. పసి పిల్లలు ఆహరం తీసుకున్న తరువాత తేపు తెప్పించడం ద్వారా  వారి పొట్టలో ఉన్న బయట వచ్చి ఎక్కువ ఆహారాన్ని తినగలరు. అంతే కాకుండా గాలి బయట రావడంతో వారికి సౌకర్యంగా మరియు హాయిగా ఉంటుంది.

ఒక్కక్క బిడ్డ ఒకోలా ప్రవర్తిస్తారు. మీ బిడ్డ కనుక తినిపించే సమయంలో కొంత తినగానే మారం చేశారనుకోండి, తినిపించడం ఆపి, తేపు తెపించి తరువాత మళ్ళి తినిపించడం ఆరంభించండి. తినిపించే సమయంలోనే కాకుండా రొమ్ము పాలు ఇచ్చే సమయంలో కూడా చేయడం మంచిది. పిల్లలను రొమ్ము నుంచి రొమ్ము మార్చే సమయంలో ఇలా చేయడం మంచిది. కొంచెం వయసు వచ్చే సరికి పిల్లలు ఎక్కువ గాలి మింగకుండా తినడం నేర్చుకుంటారు. అప్పటి వరకు మీరు టేపు తెప్పించడం మానకండి. ఇప్పుడు తేపు రప్పించడానికి సులభమైన మార్గం ఏమిటో తెలుసుకుందాము.

1. ఎదరొమ్ము మీద ఎత్తుకొని

మీ బిడ్డ చిన్ని గడ్డం మీ బుజం మీద ఉండేలా పైన ఫోటోలో ఉన్న విధంగా ఎత్తుకోండి. ఒక చేత్తో పిల్లలను శరీరానికి మృదువుగా హత్తుకొని మరొక చేతితో వీపు నెమ్మదిగా నిమరండి. ఇలా చేస్తే మీ పిల్లలకు టేపు వచ్చి ప్రశాంతంగా ఉంటారు.

2. ఒడిలో కూర్చో పెట్టుకొని

పైన ఫొటోలో చూపించిన విధంగా మీ బిడ్డను వడిలో కూర్చో పెట్టుకోండి. మీ ఒక చేయి బిడ్డ పడిపోకుండా తన చేస్త దగ్గర పట్టుకోండి. మరొక చేతితో మృదువుగా మెల్లగా బిడ్డ వీపుని తట్టండి. రెండు మూడు సార్లు తట్టేలోపే అధిక వాయువు బయట వచ్చేస్తుంది.బి

3. కాళ్ళ మీద బోర్లా పండేసుకోండి

మీ పసి బిడ్డను బోర్లా కాళ్ళ మీద పండి వీపు మీద నిమరడం వలన కూడా తేపు తెప్పించవచ్చు.  కానీ ఇలా చేసే టైములో బిడ్డ తల మిగతా శరీరం కంటే పైకి ఉండేలా చూసుకోండి. ఎందుకంటే అప్పుడే తిన్న ఆహరం బయట వచ్చే ప్రమాదం ఉంది.

Leave a Reply

%d bloggers like this: