pillala-pempakam-ummadi-kutumbam-mariyu-chinna-kutumbamloni-tedalu

ఈ మధ్య కాలంలో ఉమ్మడి కుటుంబం మంచిదా లేక చిన్న కుటుంబంగా ఉండడం మంచిదా అన్న వాదన బాగా వినపడుతోంది. ఏది మంచిది  ఏది చెడ్డది అని చెప్పడం కష్టం ఎందుకంటే దేనికుండే ఉపయోగాలు, కష్టాలు దానికి ఉన్నాయి. ఎలా ఉండాలి అనేది వారి వారి పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ, ఉమ్మడిగా ఉన్నా సపరేటుగా ఉన్నా పిల్లల పెంచడంలో జాగ్రత్త తీసుకుంటే వారికి మంచి భవిష్యత్తు అందించవచ్చు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం మరియు చిన్న కుటుంబం ఉపయోగాలు తెలుసుకుందాము.

1. మీకు సమయం లభిస్తుంది

దంపతులు ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళేలా ఉంటె మీ పిల్లలను సరైన రీతిలో పెంచడానికి మీకు కష్టం అవుతుంది మరియు పిల్లలకు తల్లిదండ్రులతో గడిపే సమయం తగ్గుతుంది. ఇలాంటి సమయాల్లో ఉమ్మడి కుటుంబంలో ఉంటె పిల్లలకు మంచిది. ఆలనా పాలనా చూడటానికి అందరు ఉంటారు. అదే మీరు చిన్న కుటుంబంలో ఉండాలనుకుంటే పిల్లలను డే కేర్ వంటి వాటిలో జాయిన్ చేయాల్సి వస్తుంది. దానికంటే ఇంట్లో అమ్మ లేదా అమ్మమ్మనో ఉంచుకోవడం మంచిది.

2. భిన్నమైన భావాలు

ఒక వేల మీ కుటుంబంలో వాళ్ళకి పిల్లలను పెంచడంలో భిన్నమైన భావాలూ ఉంటె, మీ ఆలోచనలతో సరిపడకపోతే చిన్న కుటుంబంలో పెంచడం మంచిది. భిన్న భావాలూ కలిగి ఉండడం వలన ఉమ్మడి కుటుంబంలో ఉంటె పిల్లలు సతమతానికి గురి అయ్యి మీకు నచ్చని అలవాట్లు చేసుకునే ప్రమాదం ఉంది. అంతే కాకుండా ఇతర పిల్లలతో గోడలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

3. స్వేచ్ఛ

ఉమ్మడి కుటుంబంలో పెరిగే పిల్లల కంటే చిన్న కుటుంబంలో పెరిగే పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛ లభిస్తుంది. ప్రతి చిన్న దానికి ఎవరో ఒకరి మీద ఆధారపడకుండా వారి పని వాళ్ళే చేసుకోవడం ఆరంభిస్తారు. కానీ ఇక్కడే చిన్న సమస్య ఉంది, పిల్లలు స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారా లేక ఒంటరిగా అయిపోతున్నారు అని గమనించుకోవాలి. మీ పిల్లలు ఒంటరిగా అయిపోయే స్వభావం కలవారు అయితే ఉమ్మడి కుటుంబం మంచిది.

4. ప్రభావం

ఉమ్మడి కుటుంబంలో పెరిగే పిల్లలకు తల్లి దండ్రుల నుంచి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులనుంచి కూడా ఎన్నో ఆలోచనలు  అంది లోకజ్ఞానం పెరుగుతుంది. ఇంట్లో విజయవంతమైన మనుషులు ఉంటె పిల్లల మీద వారి ప్రభావం పడి పిల్లలు కూడా మంచి మార్గంలో అడుగులు వేస్తారు. అదే చిన్న కుటుంబంలో ఉంటె ఈ విషయం మీద తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ద పెట్టి ఏది మంచి ఏది చేదు అని పిల్లలకు తరచుగా చెప్తూ వారిని మంచి మార్గంలో పయనించేలా చేయాలి.

Images Credits: Bestofme.in

Leave a Reply

%d bloggers like this: