దీనిని పిల్లలకు 6 నెలల వయసు దాటిన తరువాత నుంచి తినిపించచ్చు. బియ్యం నుండి కార్భోహైడ్రేట్స్,చికెన్ నుండి ప్రోటీన్స్, కూరగాయలలో ని పీచు పదార్ధాలతో చేసిన ఈ చికెన్ ప్యూరీ పిల్లలకు కావాల్సిన సంపూర్ణ పోషక విలువలను అందిస్తుంది. దీనిని తయారుచేసి మీ పిల్లలకు తప్పకుండా తినిపించండి…
కావాల్సిన పదార్ధాలు
నాన బెట్టిన బియ్యం – పావు కప్పు
క్యారట్ ముక్కలు – 1 కప్పు
చిలకడ దుంప ముక్కలు – 1 కప్పు
చిక్కుడు కాయలు(ముక్కలుగా కట్ చేసి ) – 4
బోన్ లెస్ చికెన్ (చికెన్ బ్రెస్ట్) – 1 లేదా 2 కప్పులు
నీళ్ళు – 3 కప్పులు
తయారు చేసే విధానం
1. ముందుగా కుక్కర్ లో నీళ్ళు పోసి, బియ్యన్నీ మొదటి పొంగు వచ్చే వరకు ఉడికించండి.
2. తరువాత చికెన్, క్యారట్ ముక్కలు, చిలకడ దుంప ముక్కలు, బీన్స్, వేసి కాసేపు ఉడికించండి.
3. తరువాత మంట తగ్గించి, తక్కువ మంటలో 30 నిమిషాలపాటు నిదానంగా ఉడికించండి. అప్పుడప్పుడు గరిటతో కలుపుతుండండి.
4. 30 నిమిషాల తరువాత, మంట ఆపేసి, చల్లార నివ్వండి.
5. తరువాత బ్లెండర్ లో వేసి మెత్తగా చేయండి.
బియ్యం నుండి కార్భోహైడ్రేట్స్,చికెన్ నుండి ప్రోటీన్స్, కూరగాయలలోని పీచు పదార్ధాలతో చేసిన ఈ చికెన్ ప్యూరీ పిల్లలకు కావాల్సిన సంపూర్ణ పోషక విలువలను అందిస్తుంది. ఈ అద్భుతమైన ఆహారాన్ని తయారుచేసి మీ పిల్లలకు తప్పకుండా తినిపించండి…
అందరికి తప్పకుండా SHARE చేయండి.
ఇవి కూడా చుడండి